Huma Qureshi Cousin: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హుమా ఖురేషి (Huma Qureshi) కజిన్ ఆసిఫ్ ఖురేషి దారుణ హత్యకు గురయ్యారు. నిజాముద్దీన్ ప్రాంతంలో ఓ పార్కింగ్ (Parking Space) విషయంలో తలెత్తిన వివాదం కారుణంగా ఈ హత్య జరిగినట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రకటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను, వారు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?
హుమా ఖురేషి తమ్ముడు ఆసిఫ్ ఖురేషి (Asif Qureshi) ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతం (Nizamuddin area)లో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆసిఫ్ ఖురేషి ఇంటి మెయిన్ గేట్ ముందు ఓ వ్యక్తి స్కూటర్ పార్క్ చేశాడు. ఇది గమనించిన ఆసిఫ్.. స్కూటర్ ను కాస్త పక్కన పార్క్ చేయాలని సూచించారు. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో.. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
బ్రదర్‌తో వచ్చి దాడి
ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో.. స్కూటర్ పార్క్ చేసిన మనిషి.. ‘మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆ వ్యక్తి తన సోదరుడ్ని వెంట పెట్టుకొని పదునైన ఆయుధంతో ఆసిఫ్ ఖురేషి ఇంటి వద్దకు వచ్చాడు. దాన్ని తీసుకొని నటి సోదరుడిపై దాడి చేశాడు. దీంతో ఆసిఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
VIDEO | Actor Huma Qureshi’s cousin, Asif Qureshi, was stabbed to death following a dispute over parking in southeast Delhi’s Bhogal area on Thursday. Two teenagers have been apprehended in connection with the incident. CCTV visuals of the incident.#DelhiNews
(Viewers… pic.twitter.com/DJrXqd3vwX
— Press Trust of India (@PTI_News) August 8, 2025
ఆసిఫ్ భార్య ఏమన్నారంటే
ఆసిఫ్ భార్య షాహీన్ (Shaheen) తెలిపిన ప్రకారం.. దాని జరిగిన వెంటనే ఆమె తన మరిది జావేద్‌కు కాల్ చేశారు. కానీ అప్పటికే ఆసిఫ్ తీవ్ర రక్తస్రావం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆసిఫ్‌ను వెంటనే ఈస్ట్ ఆఫ్ కైలాష్ (East of Kailash)లోని నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (National Heart Institute)కి తీసుకెళ్లగా వైద్యులు అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించారని స్పష్టం చేశారు. అయితే నిందితులు గతంలోనూ తన భర్తను చంపే ప్రయత్నం చేసినట్లు షాహిన్ ఆరోపించారు.
Also Read: Samantha: నాగచైతన్యని బెదిరించి పెళ్లి చేసుకుందా? ప్రముఖ సైకాలజిస్ట్ సంచలన కామెంట్స్
నటి తండ్రి ఆవేదన
హుమా ఖురేషి తండ్రి సలీమ్ ఖురేషి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా మేనల్లుడు కేవలం వాహనం కాస్త పక్కకు పెట్టమన్నందుకు ఇద్దరూ కలిసి అతన్ని చంపేశారు’ అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను ఉజ్జ్వల్ (19), గౌతమ్ (18)గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి హత్యారోపణ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.