Telangana BJP ( image Credit: twitter)
Politics

Bjp Ramchander Rao: ఇటు పార్టీ.. అటు ప్రజా సమస్యలు.. ఒకే సమయంలో రెండింటిపై ఫోకస్

Bjp Ramchander Rao: తెలంగాణ బీజేపీ ఆధిపత్య పోరు కారణంగా తీవ్రంగా సతమతమవుతున్నది. నేతల మధ్య విభేదాలతో పార్టీలో సమన్వయం లేకుండా పోయింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు(Ramchandra Rao)కు ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. అందుకే ఆయన కొత్త ఫార్ములాతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు తొలుత పార్టీలో ఉన్న సమస్యలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్లుగా సమాచారం. గ్రామీణ స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశంతో పాటు పార్టీలో సమస్యలు ఒకవైపు, ప్రజా సమస్యలను మరో వైపు తెలుసుకునే పనిలో పడినట్లుగా చర్చించుకుంటున్నారు. శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు నేతల మధ్య ఆధిపత్య పోరుకు కారణాలేంటో తెలుసుకుని సమస్యకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

 Also Read: Khammam district: జనన కోసం దరఖాస్తు చేస్తే.. మరణం ముద్రించిన అధికారులు

మార్క్ చూపించే ప్రయత్నంలో రామచందర్ రావు
తెలంగాణ బీజేపీ(Telangana BJP) కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు తన మార్క్ చూపించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. హస్తినలో అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని వచ్చిన తెలంగాణ కమల దళపతి జిల్లాల పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి నల్లగొండ, మెదక్, పాలమూరు, ఆదిలాబాద్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. లోకల్ పార్టీ ఇష్యూస్ తెలుసుకుంటున్నారు. స్థానికంగా పార్టీ కార్యకర్తల సమస్యలు రాష్ట్ర కార్యాలయం వరకు రాకుండా చూడాలని భావించినట్లు తెలుస్తున్నది. త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు కాషాయ పార్టీ తెరతీసింది. కాగా, జిల్లా పర్యటనలతో నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్
తెలంగాణలో ఉన్న 17 లోకసభ స్థానాల్లో 8 స్థానాలు బీజేపీ(BJP) కైసవం చేసుకుంది. గెలిచిన 8 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పరంగా ఏ సమస్య వచ్చినా.. అక్కడి ఎంపీలే పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తున్నది. ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే రాంచందర్ రావు ప్రకటించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సైతం ఇదే ఫార్ములా వర్తించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు లేని లోక్ సభ నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఫార్ములా బాగానే ఉన్నా కీలక నేతలను సొంత నియోజకవర్గాలకు పరిమితం చేసి కట్టడి చేస్తున్నారనే భావన మరోవైపు వ్యక్తమవుతోంది. ఇతర లోక్ సభ నియోజకవర్గాలలో ఎంపీలు జోక్యం చేసుకోకుండా, నేతల మధ్య ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేందుకు కాషాయ సారథి అనుసరించే ఈ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది చూడాల్సిందే.

 Also Read: DGP Jitender: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి.. సమీక్షా సమావేశంలో డీజీపీ జితేందర్

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?