Rahul Gandhi – MGNREGA: దేశంలో 20 ఏళ్ల చరిత్ర కలిగిన మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) ఒక్క రోజులో కేంద్ర ప్రభుత్వం కూల్చివేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. MGNREGA స్థానంలో వచ్చిన VB–G RAM G ఈ పథకానికి సంబంధించిన పురోగతి కానేకాదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. VB–G RAM G పథకం.. గతంలో కల్పించిన హక్కులు, డిమాండ్ ఆధారిత హామీని కుప్పకూల్చి.. దిల్లీ చేత నియంత్రపడే సాధారణ రేషన్ పథకంగా మార్చివేసిందని ఆరోపించారు. ఉపాధి పథకంలో తీసుకొచ్చిన మార్పులు, రాష్ట్రాలకు, గ్రామాలకు వ్యతిరేకమైనదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పథకం విచ్చిన్నం’
మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకం ఇప్పటివరకూ గ్రామాల్లోని కార్మికులను స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తూ వచ్చిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. MGNREGA స్కీమ్ ద్వారా గ్రామాల్లో శ్రమ దోపిడి, వలసలు తగ్గాయని అన్నారు. గ్రామీణ ప్రజల వేతనాలు సైతం పెరిగాయని పేర్కొన్నారు. అదే సమయంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పునరుద్దరణ జరిగిందని ఎక్స్ వేదికగా రాహుల్ తెలిపారు. అలాంటి పథకాన్ని మార్పులు తీసుకురావడం ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విచ్చిన్నం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Last night, the Modi government demolished twenty years of MGNREGA in one day.
VB–G RAM G isn’t a “revamp” of MGNREGA. It demolishes the rights-based, demand-driven guarantee and turns it into a rationed scheme which is controlled from Delhi. It is anti-state and anti-village…
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2025
‘ప్రతిపక్షాలను పట్టించుకోలేదు’
MGNREGA స్కీమ్ గొప్పతనాన్ని కరోనా కాలంలో యావత్ దేశం చూసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మూతపడి, జీవనోపాధి కుప్పకూలినప్పుడు కోట్లాది మందిని ఆకలి, అప్పుల బారిన పడకుండా కాపాడిందని గుర్తుచేశారు. ఈ స్కీమ్ మహిళలకు ఎంతగానో తోడ్పాటు అందించిందన్నారు. అలాంటి పథకాన్ని ఎలాంటి పరిశీలన లేకుండానే పార్లమెంటులో ప్రవేశపెట్టారని కేంద్రంపై రాహుల్ మండిపడ్డారు. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలనే ప్రతిపక్షం డిమాండ్ ను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ఉద్దేశం బయటపడింది: రాహుల్
MGNREGA స్కీమ్ లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రధాని మోదీ ఉద్దేశ్యాలు ఏంటో మరోమారు బయటపడ్డాయని రాహుల్ గాంధీ అన్నారు. గ్రామీణ భారత దేశాన్ని బలహీన పరచడం.. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలను ఉపాధికి దూరం చేయడం ప్రధాని మోదీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. గ్రామీణ పేదల ఆఖరి రక్షణ రేఖగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయనివ్వమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
Also Read: Telangana Govt: గ్లోబల్ సమ్మిట్‌లో ఆకట్టుకన్న నెట్ జీరో స్టాల్.. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ టార్గెట్!
లోక్ సభ ఆమోదం
ఇదిలా ఉంటే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో (MGNREGA) రూపొందించిన జీ రామ్ జీ బిల్లుకు (G Ram G Bill) గురువారం నాడు లోక్‌సభలో (Lok Sabha) ఆమోదం పొందింది. కాంగ్రెస్ (Congress) సహా విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర నిరసనలు, అభ్యంతరాల మధ్య పాసయ్యింది. జీ రామ్ జీ బిల్లుపై ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరుని తొలగించడమంటే, ‘జాతిపిత’ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారితే, రాష్ట్రాలపై భారంగా మారుతుందని మండిపడ్డారు.

