Gandhi Bhavan: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు మార్పు, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై వేధింపులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో గాంధీ భవన్ వద్దకు వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆఫీసు వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బైఠాయించిన టీసీపీసీ చీఫ్, మీనాక్షి
బీజేపీ ఆఫీసు వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ గేటు వద్ద బైఠాయించి తీవ్ర నిరసనకు దిగారు. వారితో పాటు కాంగ్రెస్ శ్రేణులు సైదం పెద్ద ఎత్తున బైఠాయించారు. దీంతో గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతారవణం చోటుచేసుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, శ్రేణులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ బిగ్గరగా అరిచారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది శాంతియుత ధర్నా.. ఇప్పటికైనా మోదీ తన తప్పు తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి
– టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ https://t.co/0JnHQwrna5 pic.twitter.com/uoXdYj63ps
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2025
మోదీ క్షమాపణ చెప్పాలి: టీపీసీసీ చీఫ్
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష పూర్తితంగా వ్యవహరిస్తోంది. మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గాంధీ ఆనవాళ్లు చేరపేయడం ఎవరి తరం కాదు. మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. బీజేపీ ఆఫీస్ పై దాడికి మేము వెళ్లడంలేదు. బీజేపీ నాయకులు పై వ్యక్తిగతంగా దూషణలు చేయడానికి బిజెపి ఆఫీస్ వైపు వెళ్లడం లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో పసలేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ప్రయివేటు వ్యక్తి కేసును ఏ రకంగా వేస్తారు అని కోర్టు ప్రశ్నిచింది. రోస్ ఎవెన్యూ కోర్టు పోలీసులు చేసిన పిటీషన్ కొట్టివేసింది’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
బీజేపీ కక్ష్యపూరిత రాజకీయాలు: మీనాక్షి
మరోవైపు ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ వైఖరి ఎండగట్టడానికే తాము ఈ ర్యాలీకి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. తాము హింసకు దూరమన్న మీనాక్షి.. శాంతియుత ధోరణిలో పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో అదుపు తప్పిన జనం.. గాయని ఏంమన్నారంటే?
బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు
బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలను ముట్టడిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. కార్యాలయాల ముట్టడులు, ధ్వంసం చేయడాలు మంచి సంస్కృతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరగాలన్నది విచారణ సంస్థలు చూసుకుంటాయని స్పష్టం చేశారు.

