Nidhhi Agerwal: గ్లామర్ ప్రపంచంలో తారలకు ఉండే క్రేజ్ ఒక్కోసారి వారికి శాపంగా మారుతుంటుంది. తాజాగా టాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లోని ఒక బహిరంగ కార్యక్రమంలో అటువంటి భయంకరమైన పరిస్థితే ఎదురైంది. అభిమానుల ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-The Raja Saab: ‘సహన సహన..’ సాంగ్ వచ్చేసింది.. ఈ పాట ఓకే!
అసలేం జరిగింది?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలోని మొదటి పాట ‘సహానా సహానా’ విడుదల వేడుక బుధవారం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ మాల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు నటి నిధి అగర్వాల్ అతిథిగా హాజరయ్యారు. అయితే, కార్యక్రమం ముగిసి ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది పురుషులు ఆమెను చుట్టుముట్టారు. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. నిధి తన వాహనం వైపు వెళ్తుండగా జనం ఆమెపైకి దూసుకువచ్చారు. బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ గుంపును నియంత్రించడం సాధ్యం కాలేదు. ఆ తోపులాటలో నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చడానికి సెక్యూరిటీ టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
చిన్మయి ఆగ్రహం
ఈ ఘటనపై ప్రముఖ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. పురుషుల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. “ఒక గుంపుగా చేరిన పురుషులు హైనాల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఒకే రకమైన మనస్తత్వం ఉన్న పురుషులు గుంపుగా కలిస్తే, ఒక మహిళను ఇలాగే వేధిస్తారు. దేవుడు వీరందరినీ తీసుకువెళ్లి వేరే గ్రహం మీద ఎందుకు వేయడో?” అంటూ ఆమె తన ఆవేదనను, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది స్పష్టమైన వేధింపు అని ఆమె అభివర్ణించారు.
భద్రతపై చర్చ
ఈ ఉదంతం సినీ వేడుకలలో భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఇంత పెద్ద మాల్‌లో ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు, పెరగబోయే రద్దీని అంచనా వేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో నటి దుస్తులను లేదా పబ్లిసిటీని సాకుగా చూపుతూ కామెంట్స్ చేయడాన్ని విజ్ఞులు తప్పుబడుతున్నారు. ఇది కేవలం ఒక నగరానికో లేదా దేశానికో సంబంధించిన సమస్య కాదని, స్త్రీల పట్ల సమాజం చూపే గౌరవానికి సంబంధించిన విషయమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ క్షేమంగానే ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన నిబంధనలు మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ అవసరమని స్పష్టమవుతోంది.
Pack of men behaving worse than hyenas.
Actually why insult hyenas. Put ‘likeminded’ men together in a mob, they will harass a woman like this.Why doesnt some God take them all away and put them in a different planet? https://t.co/VatadcI7oQ
— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025

