Police Complaint: సౌత్ ఇండియాలో పవర్‌ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వరలక్ష్మి శరత్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read also-Mega War: రామ్ చరణ్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందులోనంటే?
సాధారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ అంటే గంభీరమైన పాత్రలు గుర్తొస్తాయి. కానీ, ఈ చిత్రంలో ఆమె తొలిసారిగా పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో నటించడం విశేషం. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాదు, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది కూడా. వరలక్ష్మి గారు సెట్స్‌లో చూపించిన సహకారం వల్లే ఈ భారీ చిత్రాన్ని 45 రోజుల్లోనే పూర్తి చేయగలిగాం” అని తెలిపారు. నవీన్ చంద్ర హీరోయిజం పండించే పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించనున్నారు. రాగిణి ద్వివేది ఒక ప్రత్యేకమైన, థ్రిల్లింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్ వంటి ప్రముఖులు సినిమాలోని వినోదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లనున్నారు.
Read also-KK Passes Away: టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జున ‘కేడి’ సినిమా దర్శకుడు కన్నుమూత..
ప్రేమ, పగ, తప్పు-ఒప్పుల మధ్య సాగే ‘హైడ్ అండ్ సీక్’ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. కృష్ణసాయి, ఆదిత్య ఓం, రవిశంకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుందని, ముఖ్యంగా డ్రాగన్ ప్రకాష్-రవితేజ అందించిన యాక్షన్ సీక్వెన్స్, ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. “దర్శకుడు సంజీవ్ గారు చెప్పిన సబ్జెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నేను చేసిన కామెడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ ప్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

