Mega War: బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల మధ్య మెగా వార్ జరుగుతుంది. అది కూడా తండ్రి కొడుకుల మధ్య. అదేలా అంటారా.. మెగా కుటుంబంలో తండ్రీకొడుకుల మధ్య పోటీ అంటే అది కేవలం అభిమానానికే పరిమితం కాదు, రికార్డుల వేటలోనూ ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఆసక్తికరమైన ‘వ్యూస్ వార్’ నడుస్తోంది. తనయుడు రామ్ చరణ్ తన తండ్రి రికార్డులను అధిగమిస్తూ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
Read also-KK Passes Away: టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జున ‘కేడి’ సినిమా దర్శకుడు కన్నుమూత..
‘చికిరి చికిరి’ సెన్సేషన్..
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి విడుదలైన “చికిరి చికిరి” పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాట కేవలం నెల రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ మాస్ స్టెప్పులు, ఎనర్జిటిక్ మ్యూజిక్ తోడవడంతో యువత ఈ పాటను లూప్‌లో వింటున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ ఈ పాటను ఇంత తక్కువ సమయంలోనే వంద మిలియన్ల క్లబ్‌లో చేర్చిందని చెప్పవచ్చు.
‘మీసాల పిల్ల’
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టే “మీసాల పిల్ల” సాంగ్‌ను భారీ ఎత్తున విడుదల చేశారు. అయితే, వ్యూస్ పరంగా చూస్తే ఈ పాట ఆశించిన వేగాన్ని అందుకోలేకపోయింది. ఈ పాట విడుదలై రెండు నెలలు కావస్తున్నా, ఇప్పటికీ 85 మిలియన్ల వ్యూస్ వద్దే ఆగిపోయింది. రామ్ చరణ్ పాట నెల రోజుల్లో సాధించిన మైలురాయిని, మెగాస్టార్ పాట రెండు నెలలైనా అధిగమించలేకపోవడం మెగా ఫ్యాన్స్‌లో చర్చకు దారితీసింది. తాజాగా దీనికి సంబంధించి మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆడియన్స్ అభిరుచి మారుతోంది. చికిరి చికిరి పాటలోని బీట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు, షార్ట్ వీడియోలకు అతిగా సరిపోవడంతో అది వైరల్ అయ్యింది. రామ్ చరణ్ సాంగ్ పక్కా మాస్ నెంబర్ కావడంతో కాలేజీ కుర్రాళ్లు, మాస్ ఆడియన్స్ దీనికి బ్రహ్మరథం పట్టారు. పెద్ది చిత్ర యూనిట్ సోషల్ మీడియాను వాడుకున్న తీరు కూడా ఈ వ్యూస్ వెనుక ఉన్న బలమైన కారణంగా కనిపిస్తోంది. వ్యూస్ పరంగా చరణ్ తన తండ్రిని అధిగమించినప్పటికీ, సినిమాల పరంగా మాత్రం ఇద్దరిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో మెగాస్టార్ తన సీనియారిటీతో ఏ స్థాయి వసూళ్లు రాబడతారో, అలాగే రామ్ చరణ్ తన క్రేజ్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.
Audiences continue to celebrate the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 😍🔥
85M+ Views with 500K+ Likes for #MeesaalaPilla on YouTube ❤️
GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY ❤️🔥
Megastar @KChiruTweets
Victory @VenkyMama… pic.twitter.com/UVE3L6lqvY— Shine Screens (@Shine_Screens) December 17, 2025

