The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ విలువలతో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు ని. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. చిత్ర ప్రమోషన్లలో భాగంగా బుధవారం ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఈ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే..
Also Read- Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!
పాటంతా ఓకే కానీ…
మొదటి వచ్చిన సాంగ్ కంటే లిరిక్స్ పరంగానూ, సంగీతం పరంగానూ ఈ సాంగ్ చాలా ఉన్నతంగా ఉంది. సంగీత దర్శకుడు థమన్ చాలా కొత్తగా ఈ పాటను ట్రై చేశారు. విశాల్ మిశ్రా, థమన్, శృతి రంజని ఈ పాటను ఆలపించారు. పాటను చూడటానికి మాత్రం చాలా కలర్ ఫుల్‌గా ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పుడు భారీగా ట్రోలింగ్ నడిచింది. ఈ సాంగ్ పారంగా మాత్ర ఓకే చెప్పుకోవచ్చు. డ్యాన్స్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. పాటంతా బాగుంది, లొకేషన్స్ అదిరిపోయాయి. హీరో కాస్ట్యూమ్స్, డ్యాన్స్ మాత్రం తేలిపోయాయి. దీనిపై ఏమైనా నెగిటివ్ ఏర్పడే అవకాశం ఉంది. థమన్ మాత్రం ఈసారి సేఫ్ అని చెప్పుకోవచ్చు.
Also Read- Venu Udugula: పద్మశ్రీ పొందిన ముఖం, ఖాళీ గోడలా కనిపిస్తోందా?.. వేణు ఊడుగుల పోస్ట్ వైరల్!
ప్రీమియర్స్‌లో కలుద్దాం
ఇక సాంగ్ లాంచ్ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ఈ మూవీలోని సాంగ్స్ అన్నీ సూపర్బ్‌గా వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్‌ను బాగా ఆదిరించారు. ఇప్పుడు బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన’ను మీ ముందుకు తెచ్చాం. ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా అదిరిపోతాయి. ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్‌లో ప్రభాస్ చేసిన సాంగ్, ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్సులు అదిరిపోతాయి. జనవరి 8న ‘ది రాజా సాబ్’ ప్రీమియర్స్‌లో కలుద్దామని అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్‌కు మీ దగ్గర నుంచి వస్తున్న మాస్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రభాస్ మీ కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఫ్యాన్స్‌ను అలరించేందుకు చాలా కష్టపడతారు. ఈ సంక్రాంతి ‘రాజా సాబ్’తో రెబల్ సంక్రాంతి అవుతుంది. రెడీగా ఉండండి అని తెలిపారు. అభిమానులు కోరుకున్నట్లే జనవరి 8న ప్రీమియర్స్ వేయబోతున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

