Medchal Black Magic: మేడ్చల్‌లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. పూజలు జరిగిన ఆనవాళ్లు కనపడంతో ఒకసారిగా అక్కడి పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మేడ్చల్ పట్టణంలోని కె ఎల్ ఆర్ వెంచర్ లో రోడ్డుపై క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు కనిపించాయి. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొట్టిన కొబ్బరికాయలు, పూలు, పేలాలు, పిండాలు పెట్టారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు రాలేదు: మేడ్చల్ సీఐ సత్యనారాయణ
మేడ్చల్ పట్టణం మధ్యలో నడిరోడ్డుపై ఎవరి పని చేసి ఉంటారని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పల్లెల్లో సైతం కనిపించడం లేదని, ఈ పని చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. క్షుద్ర పూజల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని మేడ్చల్ సీఐ సత్యనారాయణ(Medical CI Satyanarayana) తెలిపారు. క్షుద్ర పూజలు ప్రజలు ఎవరు నమ్మొద్దని సిఐ చెప్పారు. పట్టణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ సత్యనారాయణ తెలిపారు.
Also Read: Minister Seethakka: ఆ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించండి.. మంత్రి సీతక్క అభ్యర్థన

