Konda Surekha ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Konda Surekha: అటవీ పరిరక్షణకు వెనకడుగు వేయొద్దు.. ఫారెస్టు అధికారులకు మంత్రి కొండా ఆదేశం!

Konda Surekha: రాష్ట్రంలో ఫారెస్టుల్లో ఫైర్స్ తగ్గించేందుకు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అటవీ పరిరక్షణకు ఏ చర్యకైనా వెనకడుగు వేయొద్దని ఫారెస్టు ఉన్న‌తాధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు, ఎకో టూరిజం డెవలప్ చేసి ఫారెన‌ర్స్ ని కూడా ఆక‌ర్షించే విధంగా ప్ర‌ణాళిక‌లు రూప‌క‌ల్ప‌న చేయాల‌న్నారు. అట‌వీ, టూరిజం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌తో కూడా సంయుక్తంగా ఒక మీటింగు పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే చ‌ర్య‌లు అవ‌స‌రమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌చివాల‌యంలో శనివారం తెలంగాణ హరిత నిధి రాష్ట్ర స్థాయి స‌మావేశం నిర్వహించారు.

Also ReadKonda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..

2025-26 బ‌డ్జెట్ పై సుదీర్ఘంగా చర్చ

హరితనిధి వినియోగంపై సమగ్ర చ‌ర్చ చేశారు. నర్సరీలను ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు మంత్రి సురేఖ ప్ర‌త్యేక సూచ‌న‌లు చేశారు. అడవుల్లో ఫైర్స్ కంట్రోల్ చేయడం అనివార్యమని అభిప్రాయ‌ప‌డ్డారు. దానితో అటవీ సంపద, జంతువుల పరిరక్షణ చేపట్టినట్టు అవుతుందన్నారు. 2025-26 బ‌డ్జెట్ పై సుదీర్ఘంగా చర్చించారు. వాటిని త‌గ్గించేందుకు ప్ర‌స్తుతం అవ‌లంభిస్తున్న విధానాల‌పై మంత్రి ఆరా తీశారు. వీటిపై రానున్న రోజుల్లో మరింత శాస్త్రీయంగా ముందుకు వెళ్ళేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. దీనిపై ఏమైనా ఇబ్బందులు త‌లెత్తితే… ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌మ‌కు తెలియ‌జేయాల‌ని మంత్రి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

హనుమకొండ 24 గ్రీనరీ ప్రాజెక్టుల అభివృద్ధి

హరిత నిధి కింద నర్సరీల పెంపకం (గంధపు చెక్క, వెదురు, టేకు, శాంటాలమ్ ఆల్బమ్) మౌలిక సదుపాయాల అభివృద్ధితో 26 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, నిర్వహణ చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివ‌రించారు. నాలుగు ఎకో టూరిజం ప్రదేశాల అభివృద్ధి, కాకతీయ జూలాజికల్‌లో అభివృద్ధి, నిర్వహణ చేయడం జరుగుతుంద‌న్నారు. పార్క్, హనుమకొండ 24 గ్రీనరీ ప్రాజెక్టుల అభివృద్ధి (అవెన్యూ ప్లాంటేషన్లు) సిబ్బందికి సామర్థ్య నిర్మాణ శిక్షణలు ఇచ్చిన‌ట్టు తెలిపారు. విద్యార్థులకు వనదర్శిని కార్యక్రమాలు మొదలయ్యాయని, నాగార్జున సాగర్‌లో వన్యప్రాణుల నిర్వహణ చేపడుతున్నామ‌న్నారు. నారాయణపేటలో బ్లాక్‌బక్ రెస్క్యూ అండ్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. అగ్ని రక్షణ, నియంత్రణ నిర్వహణ చేపడుతున్నారు. వరంగల్ నుంచి మేడారం రహదారి వరకు (సమ్మక్క సారక్క కారిడార్) అవెన్యూ, ఇతర తోటల పెంపకం చేపట్టడం జ‌రుగుతుంద‌న్నారు. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని మాస్ ట్రీ ఫాల్ వద్ద పునరుజ్జీవన కార్యకలాపాల చేపట్టడం జరుగుతుంద‌ని వివ‌రించారు.

Also Read: Konda Surekha: రైతులు ఎవరు అదైర్య పడవద్దు నష్టపరిహరం చెల్లిస్తాం: మంత్రి కొండ సురేఖ

Just In

01

Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..

Bride Murder: చీర విషయంలో ఘర్షణ.. పెళ్లికి గంట ముందు పెళ్లికూతుర్ని చంపేసిన కాబోయేవాడు

Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు.. భారీగా నగదు, డాక్యుమెంట్ల స్వాధీనం

Andhra King Taluka: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..