Konda Surekha: రైతులు అదైర్య పడవద్దు నష్టపరిహరం చెల్లిస్తాం
Konda Surekha (imagecredit:swetcha)
Telangana News

Konda Surekha: రైతులు ఎవరు అదైర్య పడవద్దు నష్టపరిహరం చెల్లిస్తాం: మంత్రి కొండ సురేఖ

Konda Surekha: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్ఎన్ నగర్(NN Nagar), బీఆర్ నగర్(BR Nagar) ప్రాంతాల్లో ఎంపీ కడియం కావ్య(MP Kadiyam Kavya), జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada)తో కలిసి సందర్శించారు. బాధితులకు దైర్యం చెప్పారు.

నాలాలు ఉండకపోవడం..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుపాను వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని, గత ఐదేళ్ల నుండి ముంపు పరిస్థితి తలెత్తుతున్నదన్నారు. నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఉండడం, కొన్ని కబ్జాకు గురి అవ్వడం, సరైన వెడల్పుతో నాలాలు ఉండకపోవడం ఇందుకు కారణమని, ఇకముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారి ఆదేశం మేరకు ముందుకు వెళతామని కొండా సురేఖ తెలిపారు. వరద ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అందుబాటులో ఉన్న డీఆర్ఎఫ్ బృందాలకు తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పిలిపించడం జరిగిందని వివరించారు.

Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

 విద్యుత్ మోటార్లు సైతం..

మహబూబాబాద్ జిల్లాపై ‘మొంథా’ తుపాన్ పెను విధ్వంసం సృష్టించింది. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతూ, జిల్లా వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల ఎకరాల పంట ధ్వంసం చేసి పోయింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను తుపాను పూర్తిగా దెబ్బ తీయడంతో రైతాంగం లబోదిబో మంటోంది. వరి పొట్ట దశకు వచ్చి, కంకులు తయారయ్యే దశలో ఉండగా, నీటిలో ఒంగిపోయి పూర్తిగా తడిసిపోయింది. ఈ కారణంగా వరి ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంటలతో పాటు, పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లు సైతం వరద నీటిలో మునిగిపోవడంతో రైతులకు అదనపు ఆర్థిక భారం పడింది. కేసముద్రం మార్కెట్‌కు తీసుకొచ్చిన మొక్కలు కూడా మార్కెట్ యార్డులోనే తడిసి ముద్దయిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో మొత్తం జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. తుపాన్ ధాటికి చెల్లాచెదరైన పంటలను సందర్శించి పంట న

Also Read: Gold Repatriation: యూకే నుంచి 274 టన్నుల బంగారం పట్టుకొచ్చిన ఆర్బీఐ.. ఎందుకు?, ఏం జరగబోతోంది?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క