Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఎన్నికల సన్నద్ధత
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ముసాయిదా ప్రచురణను అందుబాటులో ఉంచారు. జనవరి 1వ తేదీన ప్రకటించిన ఓటర్ల ముసాయిదాపై ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేసి, రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో పోలింగ్ జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read: Municipal Elections: మున్సిపాలిటీలో ఎన్నికలకు అధికారుల కసరత్తు.. ఆశావాహులకు టికెట్లు దక్కుతాయా?
ఆశావహుల సందడి
సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండటంతో క్షేత్రస్థాయిలో రాజకీయ సందడి మొదలైంది. టికెట్ ఆశించే వారు ఇప్పటికే తమ అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే వస్తున్న పండుగలు, శుభకార్యాలను సాకుగా తీసుకుని ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. వార్డుల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.
వీటికే ఎన్నికలు
2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో శంకర్ పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాద్ నగర్, కొత్తూర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ మున్సిపాలిటీలకు, అలాగే వికారాబాద్ జిల్లాలోని తాండూర్, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం కావడంతో అక్కడ మున్సిపల్ ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది.
Also Read: Local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేల ఫోకస్
ఆమనగల్

