Nirmal District: ఖానాపూర్ మైనార్టీ హాస్టల్ విద్యార్థులను కూలీలుగా మారుస్తున్నా అక్కడి హాస్టల్ సిబ్బంది. విద్యా బుద్దులు నేర్చుకొనేందుకు వచ్చిన పిల్లలతో కూలి పనులా చేసిస్తున్నారు. వాళ్ళు చెబితే ఎంత బరువైన, ఎంత దూరమైనా మోయాల్సిందే లేదంటే పరిస్థతి ఇంకోలా అన్నట్టుగా ఉంటుంది.
వివరాల్లోకి వెలితే..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్(Minority Residential School)లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో హాస్టల్ నుండి సుమారుగా కిలోమీటర్ వరకు వాగులో నుండి రోజు నలుగురు విద్యార్థులచే రెసిడెన్షియల్ స్కూల్ వరకు పాల పాకిట్స్ మోయించారు. విద్య బుద్దులు నేర్పిస్తారని పాఠశాలకు పంపిస్తే మా పిల్లలను కూలీలుగా మారుస్తారా అంటూ తల్లిదండ్రులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Delhi Car Blast: ఎవ్వరినీ వదిలిపెట్టం.. తగిన శాస్తి చేస్తాం.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
గతంలో కూడా..
విద్యార్థుల హాస్టల్ లో అన్ని పనులు పిల్లలతో చేయిస్తున్నరంటు గతంలో కూడా సిబ్బందిపై పిర్యాదులు వున్నప్పటికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో చదుకోవాల్సినా పిల్లలు కూలీలా అవతారం ఎత్తల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు హాస్టల్ పర్యవేక్షించి బాద్యులైన అధికారులపై చేర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నాయి.
Also Read: Konda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..
