Akhil Lenin: ప్రముఖ నిర్మాత నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా గురించి ఒక విషయం బయట పెట్టారు. ఎందుకు ఆ సినిమా ప్రమోషన్లు చాల స్లోగా సాగుతున్నాయో అన్నదానికి సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా తన పనితీరులో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. లెనిన్ సినిమా ఎందుకు ప్రమోషన్ పరంగా స్లోగా ఉంటుంది అని అడగ్గా.. ఈ సినిమా విషయంలో ‘కంటెంట్ మాత్రమే మాట్లాడాలి, అనవసరమైన హడావిడి వద్దు’ అని అఖిల్ స్పష్టంగా చెప్పినట్లు నాగవంశీ తెలిపారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ కోరిక మేరకు ‘లెనిన్’ సినిమా షూటింగ్‌ను ఎటువంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలో తాను మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదంగా మారడం లేదా మిస్‌ఫైర్ అవ్వడం వల్ల, ఇకపై సినిమా విడుదలకు ముందు ఎక్కువగా మాట్లాడకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. మొత్తానికి, ‘లెనిన్’ సినిమాను భారీ హంగులతో కాకుండా, బలమైన కంటెంట్‌తో ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది.
Read also-DSP Recreates: ‘దేఖలేంగే సాలా’ పాట రీ క్రియేషన్‌తో ఊపేస్తున్న రాక్‌స్టార్.. ఏమాత్రం తగ్గలేదు..
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభించారు నిర్మాతలు. లెనిన్ సినిమా నుంచి మెందటి సాంగ్ వచ్చేది ఎప్పుడో కూడా చెప్పేశారు. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమకు థమన్ సంగీతం అందించడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన ప్రోమోను చూస్తుంటే ఈ సాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. లెనిన్ సినిమా నుంచి ఫుల్ సాంగ్ జనవరి 5, 2026 న విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ పాట కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా 2026 సమ్మర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. అయితే ఈ సినిమాతో అయితే అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.
Read also-Allu Lokesh: పుష్పరాజ్‌తో జతకట్టబోతున్న కనకరాజ్!.. ప్రొడ్యూసర్ ఎవరంటే?

