Allu Lokesh: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫిల్మ్ దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ ను కలిసిశారు. అప్పుడే బన్నీకి లోకేష్ కథ చెప్పారని దానికి బన్నీ ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ నడుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ కు నిర్మాతగా ఎవరు వ్యవహరనేది పెద్ద్ చర్చనీయాంశం అయింది. అయితే ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తోంది. అదే గనక నిజం అయితే ఇండియాలో బన్నీ ఓ సూపర్ స్టార్ అయిపోతాడు. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే బన్నీ అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా అంటే ఇది కూడా పాన్ ఇండియా హిట్ అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు. ఈ సినిమా అట్లీ సినిమా అయిపోయాకా పట్టాలు ఎక్కుతుందని తెలుస్తోంది.
Read also-Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి సవాల్ విసిరిన ఏయ్ జూడ్.. రా నీ కోసం రెడీగా ఉంది..
ఇదే కథాంశం..
ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ‘ది స్టీల్ క్లా’ అనే పాపులర్ కామిక్ బుక్ ఆధారంగా రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ. ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయిన వ్యక్తి, ఆ స్థానంలో ‘మెటల్ క్లా’ పెట్టుకుంటాడు. ఆ తర్వాత అతనికి వచ్చే సూపర్ పవర్స్ అతను చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. నిజానికి లోకేష్ ఈ కథను 10 ఏళ్ల క్రితమే రాసుకున్నారట. మొదట సూర్యతో చేయాలనుకున్నారు కానీ బడ్జెట్, టెక్నాలజీ కారణాల వల్ల అప్పట్లో సాధ్యపడలేదు. తాజాగా లోకేష్ ఈ కథను అల్లు అర్జున్‌కు వినిపించడం, దానికి బన్నీ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు ఈ లోకేష్ ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా మారింది.
Read also-Naache Naache Song Promo: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన సాంగ్ ప్రోమో ‘నాచే నాచే’ ఎలా ఉందంటే?
షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..
ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పాన్-ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువల(VFX)తో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కూడా లోకేష్ తన LCU లో భాగంగా తీస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇది ఒక స్టాండ్-అలోన్ సూపర్ హీరో మూవీ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి అప్డట్ కోసం బన్నీ ఫ్యాన్స్ అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది.

