Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ప్రస్తుతం చర్చల్లో ఉన్న శివాజీ విషయం నుంచి దేశ భద్రత వరకూ అన్నీ తనకు తెలుసు అని చెప్పుకుంటూ.. గరికపాటిపై, చాగంటిపై , యాక్టర్ శివాజీ పై తాజాగా ఏయ్ జూడ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదం అవుతున్నాయి. ఇటీవల పెట్టిన ఓ వీడియోలో ఏయ్ చూడ్ కాసుకో నువ్వే తర్వాత అంటూ చెప్పడంతో ఏయ్ జూడ్ అజయ్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి ‘హాయ్ అన్వేష్ పార్ట్ 2 : సజ్జనార్ ఎంటర్స్’ అంటూ వీడియో చేశారు. దీంతో ఈ వివాదం వీరిద్దరి మధ్య మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు వీడియోల ద్వారా సవాళ్లు విసురుకుంటున్నారు.
Read also-Anvesh Controversy: గరికిపాటిపై రెచ్చిపోయిన యూట్యూబర్ అన్వేష్.. ఏయ్ జూడ్ నెక్స్ట్ నువ్వే..
ఏయ్ జూడ్ విడుదల చేసిన వీడియోలో ఏం చెప్పారంటే.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ విషయంపై స్పందించినట్లు వార్తలు వస్తున్నాయని, ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలని జూడ్ సజ్జనార్ ను కోరారు. ఐబొమ్మ రవి కేసులో పోలీసులు ఎలాగైతే స్పందించారో, ఈ విషయంలో కూడా అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించాలని రిక్వెస్ట్ చేశారు. అన్వేష్ విదేశాల్లో ఉండి మాట్లాడుతున్నారని, దమ్ముంటే ఇండియాకు వచ్చి తనపై ఉన్న ఎఫ్ఐఆర్లను (FIRs) ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అన్వేష్ ఇండియాకు రావడానికి తాను బిజినెస్ క్లాస్ టికెట్ కొనిస్తానని, ఎయిర్పోర్ట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కారు కూడా ఏర్పాటు చేస్తానని ఏయ్ జూడ్ పేర్కొన్నారు.
Read also-Naache Naache Song Promo: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన సాంగ్ ప్రోమో ‘నాచే నాచే’ ఎలా ఉందంటే?
సీతాదేవి, ఆంజనేయ స్వామి గురించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జూడ్ మండిపడ్డారు. కేవలం సారీ చెబితే సరిపోదని, చట్టపరమైన శిక్ష అనుభవించాలని అన్నారు. అన్వేష్ తనను, తన కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ తాను దేనికీ భయపడనని జూడ్ స్పష్టం చేశారు. అన్వేష్ గతంలో చేసిన తప్పులు, ఆడియో లీక్స్ తన దగ్గర ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని చెప్పారు చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదని, అందరూ కలిసి ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని ఏయ్ జూడ్ కోరారు. అన్వేష్ కు నిజంగా దమ్ము ఉంటే ఇండియాకు రాలని కావాలంటే తనకు బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తానని, అక్కడి నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ల డానకి మంచి కారు కూడా ఏర్పాటు చేస్తానని అన్వేష్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

