India On Venezuela Crisis: వెనిజులా ప్రజలకు భారత్ కీలక సందేశం
Venejuela (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

India On Venezuela Crisis: ‘మీ భద్రతకు మా మద్దతు’.. వెనిజులా ప్రజలకు భారత ప్రభుత్వం కీలక సందేశం

India On Venezuela Crisis: దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా దేశంలో అనూహ్య పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తమ దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ తరలించే నార్కో ఉగ్రవాదాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలతో శనివారం వేకువజామున వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నివాసంపై (Nicolas Maduro arrest) అమెరికా ప్రత్యేక బలగాలు మెరుపుదాడి చేశాయి. మదురోతో పాటు ఆయన భార్యను కూడా నిర్బంధించి అమెరికా తీసుకెళ్లిపోయారు. అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా ఈ పరిణామంపై భారత కేంద్ర ప్రభుత్వం (India On Venezuela Crisis) ఆదివారం స్పందించింది. వెనిజులా రాజధాని కారకస్‌లో దాడులు, అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక ప్రకటన విడుదల చేసింది.

వెనిజులా ప్రజల భద్రతకు మద్దతిస్తాం

వెనిజులాలో చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరమైనవని భారత్ వ్యాఖ్యానించింది. ఆ దేశ ప్రజల క్షేమం, భద్రతకు మద్దతు ఇస్తుందనే విషయాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. సమస్యలు అన్నింటిని శాంతియుతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా, వెనిజులాకు సూచించింది. చర్చల ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని భారత్ కోరుతోందని పేర్కొంది. మరోవైపు, వెనిజులా రాజధాని కరాకస్‌లోని భారతీయ పౌరులతో అక్కడి భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది.

Read Also- Jana Nayakudu Trailer Trolled: విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో ఈ తప్పును చూశారా.. తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అమెరికా సైనిక చర్య.. మదురో అరెస్ట్

నికోలస్ మదురోని దాదాపు కొన్ని నెలల నుంచి బెదిరిస్తూ వచ్చిన అమెరికా శనివారం నాడు అనూహ్య చర్యకు పాల్పడింది. ప్రత్యేక బలగాలు రాజధాని కారకస్‌లో సైనిక చర్యకు దిగాయి. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేసి తరలించారు. ప్రస్తుతం ఆయనను న్యూయార్క్‌లో ఉన్నారు. ఇక, వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే, ఆ దేశానికి చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి స్వేచ్ఛ గడియలు వచ్చాయని అభివర్ణించారు. కాగా, మచాడోకు వెనిజులా ప్రజల్లో చాలా పాపులారిటీ ఉంది. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిగా నిలిచిన ఆమెను అధ్యక్ష పదవిని చేపట్టాలంటూ పెద్ద సంఖ్యలో అక్కడి జనాలు సూచనలు చేస్తున్నారు. అయితే, మచాడోకు అధికారం అప్పగించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పిటికే కొట్టిపారేశారు. వెనిజులాలో ఆమెకు తగిన మద్దతు, గౌరవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వెనిజులాను అమెరికాయే నడిపిస్తుందని స్పష్టం చేశారు. దీంతో, వెనిజులా భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొంది.

Read Also- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ స్పందనలు ఇవే

Just In

01

Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!

MLC Naveen Rao: ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దు.. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు!

BRS: వాకౌట్ చేసి తప్పు చేశామా? గులాబీ గూటిలో ఒక్కటే చర్చ!

Harish Rao: కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ.. రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్!

Kavitha: ఒక్క మాటంటే.. బాయ్‌కాట్ చేస్తారా? ఈ నిర్ణయం అధిష్టానానిదా.. హరీశ్ రావుదా?