Health Tips: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవి మనకి రైస్ తో సమానం. అన్నం తింటే ఎలా కడుపు నిండుతుందో.. ఇవి ఒక పూట తిన్నా కూడా కడుపు నింపుతుంది. ఎందుకంటే, వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, పండ్లు తిన్న వెంటనే నీరు చాలామంది తాగుతుంటారు. కానీ, నిపుణుల ప్రకారం ఇది జీర్ణక్రియకు, ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.
1. జీర్ణక్రియకు ఆటంకం కలిగించకూడదు
పండ్లు సులభంగా జీర్ణమయ్యే ఫుడ్ గా చెబుతుంటారు. కానీ, వెంటనే నీరు తాగితే కడుపులో ఉన్న ఆమ్లాలు (స్టమక్ ఆసిడ్స్) సన్నబడి జీర్ణక్రియ మందగిస్తుంది. దీని ఫలితంగా బొజ్జ నొప్పి, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
2. కడుపులో ఫెర్మెంటేషన్ సమస్య
మామిడి, అరటి, ద్రాక్ష వంటి చక్కెర ఎక్కువగా ఉన్న ఫలాలు తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో ఫెర్మెంటేషన్ జరుగుతుంది. దీని వల్ల వాయువు, ఆమ్లత్వం (అసిడిటీ), కడుపు నొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి.
3. ఎసిడిటీ, ఉబ్బరం పెరుగుతుంది
నారింజలు, అనాసపండ్లు వంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫలాల తర్వాత నీరు తాగితే కడుపులో pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీని వలన ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం సమస్యలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి.
4. పోషకాలు శోషణ తగ్గిపోతుంది
పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించాలంటే జీర్ణక్రియ సజావుగా జరగాలి. నీరు వెంటనే తాగితే జీర్ణ ఎంజైమ్స్ సన్నబడి పోషకాలు శోషించబడే సామర్థ్యం తగ్గుతుంది.
5. బరువు పెరగడం
పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగించి మెటబాలిజం కూడా తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
ఏం చేయాలంటే?
1. ఫ్రూట్స్ తినే ముందు లేదా భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఇవ్వండి.
2. పండ్లు తిన్న తర్వాత నీరు తాగాలంటే 30 నుంచి 40 నిమిషాలు ఆగండి.
3. దాహంగా ఉంటే కొద్దిగా నీరు తాగండి కానీ ఒక గ్లాస్ పూర్తిగా తాగకండి.
గమనిక: పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
