Bigg Boss 9 Telugu: దివ్వెల మాధురి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళను అని చెప్పిన ఈవిడ గారు వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఎలిమినేట్ కూడా అయింది. అయితే, బయటకొచ్చాక నాకు వెళ్ళాలనిపించింది వెళ్ళా.. ఇప్పుడు రావాలనిపించింది వచ్చానంటూ వంకర టింకరగా మాట్లాడుతుంది. అయితే, ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ ఫ్యాక్ట్స్ ను బయటపెట్టింది. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు దివ్వెల మాధురి దిమ్మ తిరిగే ఆనర్స్ చెప్పింది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరేం చెబుతారని అడగగా.. స్క్రిప్టెడ్ అయితే కాదని చెప్పింది. మరి లవ్ ట్రాక్స్ నిజమేనా అడగగా.. 100% ఫేక్ అని ఓపెన్ గా చెప్పింది. రీతూ, డిమోన్ ప్రేమ నిజం కాదు.. కేవలం అక్కడ ఉండటం కోసమే ఇద్దరూ నటిస్తున్నారు. వాళ్ళు ఏదో చెయ్యలని అలా చేస్తున్నారు. నాకు అది అస్సలు నచ్చలేదు. భరణి, దివ్య డి నాకు నచ్చలేదు. మిగతా వాళ్లు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు.
ఇప్పుడైతే నేను 100% బయటకు రావాలనుకున్నాను. కానీ, నాకు ఓట్స్ తగ్గుతాయంటే నేను నమ్మను. ఓటింగ్ లో తప్పు జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఉంచుతున్నారు. మిగాతా వాళ్ళని పంపిస్తున్నారు. నేను అయితే బలంగా నమ్ముతున్నాను. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదని చెప్పింది. భరణి ఎలిమినేట్ అయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు? దీనిని మీరు నమ్ముతారా అని అడగగా.. పబ్లిక్ ఓటింగ్ తోనే ఎలిమినేట్ అయినా భరణి మళ్ళీ వారం తర్వాత అదే పబ్లిక్ ఓటింగ్ తోనే ఇంట్లోకి వచ్చారంటే ఎలా నమ్ముతాను అంటూ మండిపడింది.
Also Read: Kishan Reddy: అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నది ఎవరు?.. ప్రభుత్వం పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఓటింగ్ ప్రకారం జరగడం లేదంటున్నావ్.. అసలు నీకు ఎవరూ ఓటు వేయలేదు కాబట్టి బయటకు వచ్చావ్.. నువ్వు, పచ్చళ్ళ రమ్య వెళ్ళాక సీన్ మొత్తం మారిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

