CM Revanth Reddy: కొడంగల్‌లో అక్షయ పాత్ర ఫౌండేషన్
CM Revanth Reddy ( image credit: swtcha reporter)
Telangana News

CM Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు!

CM Revanth Reddy: కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది ఉదయం అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు.నవంబర్ 14వ తేదీన కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణం ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారు.

Also Read: CM Revanth Reddy: నేడు ఎస్‌ఎల్‌బీసీ పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ తో కలిసి ఏరియల్ సర్వే

అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది.ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ పథకం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ పాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది. 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Also ReadCM Revanth Reddy: బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటరును కలవాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రివ్యూ

Just In

01

BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!

Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం