CM Revanth Reddy ( image credit; swetcha reporter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: నేడు ఎస్‌ఎల్‌బీసీ పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ తో కలిసి ఏరియల్ సర్వే

CM Revanth Reddy: నల్గొండ వరప్రదాయణిగా పిలిచే SLBC ప్రాజెక్టు పనులను పూర్తి చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాద ఘటనతో నిలిచిపోయిన పనుల్లో కదలిక వచ్చింది. 2027నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలను వేగం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. దీంతో నల్గొండ జిల్లా ప్రజలు, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.

Also Read:CM Revanth Reddy: మొంథాతుపాన్ ప్రభావంపై.. ఆఫీసర్లకు సీఎం కీలక అదేశాలు! 

ఇదీ నేపథ్యం

కృష్ణా నది నీటి ఆధారంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని సుమారు 400,000 ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటుగా 500కుపైగా గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్(SLBC) ప్రాజెక్ట్ దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 2005సంవత్సరంలో దాదాపు 2వేల 800కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం నల్లమలలోని‌ దట్టమైన అడవిలో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం కలిగి ఉంది. ఇందులో 35 కిలోమీటర్ల పని పూర్తయింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పథకం పనులు ముందుకు కదల లేదు.

పనుల పునరుద్ధరణకు శ్రీకారం

ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అధికారంలోకి రావడంతో పాలమూరుకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. దీంతో నల్గొండ ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు ఈ ఏడాది ఆరంభంలో పనులను ప్రారంబించారు. ఇందులో భాగంగా మిగిలిన 9 కిలోమీటర్ల కెనాన్ ను తవ్వే పనులు పునరుద్ధరించారు. ఆ సమయంలో నల్లమల అడవిలో భారీగా వర్షాలు కురిశాయి. దీని వల్ల నీటి ఊటలు కిందకు జాలువారాయి. దీనికితోడుగా పదేళ్లపాటు బీఆర్ఎస్ పనులను నిలిపివేయడంతో టన్నెల్ శిథిలమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు పనుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇది నల్గొండ ప్రజల్లో ఎంతో సంతోషాన్ని కలిగించింది.

సొరంగం పనులను వేగవంతం

అయితే అప్పటికే శిథిలమైపోయిన టన్నెల్ ఆకస్మికంగా కూలిపోయింది. సొరంగంలో 2.5 కి.మీ. వరదలు సంభవించాయి. ఈ పనులు చేసేందుకు సొరంగంలోపలికి వెళ్లిన ఇంజనీయర్లు, కూలీల్లో 8 మంది టన్నెల్ లోనే కూరుకుపోయి చనిపోయారు. ఈ ప్రమాదంలో 130 మీటర్ల పొడవైన టన్నెల్ బోర్ మెషిన్ (TBM) బురద మరియు నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించగా మృతదేహాల కోసం నెలలపాటు వందలాదిమంది, కోట్ల రూపాయలతో చేసిన ప్రయాసలు వృధాగా మారాయి. ఈ నేపథ్యంలో సొరంగం పనులను వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన సాంకేతిక పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించింది

సీఎం లక్ష్యం

ప్రమాద ఘటనను ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మంత్రులు, అధికారులను అక్కడే ఉంచుతూ సహాయక చర్యలతో పాటుగా పనుల పురోగతిపై ఏడాది నుంచి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్ కావడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న వాదన ఉంది. 2017లో‌ ప్రాజెక్ట్ వ్యయం అంచనా 3వేల కోట్లకు పెంచడం జరిగింది. అయితే బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో కేవలం 500 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయని, ఇందులో 2020, 2021, 2022లో చూస్తే కేవలం 10కోట్లే విడుదల కావడం గమనార్హం. ఇది ప్రాజెక్టు నిర్వహణకే భారంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అంచనాను 4వేల 600కోట్లకు పెంచింది. నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. తిరిగి ప్రాజెక్టు (సొరంగం) పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్ మెషిన్ బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది.

2024-25 బడ్జెట్లో రూ.800 కోట్లు ప్రభుత్వం

ఇందుకు ముందస్తుగా రూ.50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు గతేడాది ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్లో రూ.800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని గత జులైలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం హెలికాప్టర్ ద్వారా నడిచే ‘VTEM ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే’ని ప్రారంభించనున్నారు. అనేక మంది సొరంగం నిపుణులు హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించాలని సిఫార్సు చేశారు, దీనిని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిర్వహిస్తుంది.

ఈ సర్వేలో సొరంగం అమరికపై ప్రత్యేక అండర్ స్లంగ్

నీటిపారుదల అధికారుల అభిప్రాయం ప్రకారం, ఈ సర్వేలో సొరంగం అమరికపై ప్రత్యేక అండర్ స్లంగ్ ట్రాన్స్మిటర్ (24 మీటర్ల వ్యాసం కలిగిన లూప్)తో హెలికాప్టర్‌ను ఎగురవేయడం జరుగుతుంది. ఇది భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపి సుడిగుండాలను సృష్టిస్తుంది. తరువాత అవి ప్రతిబింబించి చిన్న రిసీవర్ లూప్‌లో నమోదు చేస్తాయి. ఈ సర్వే సురక్షితమైన మరియు స్థిరమైన పురోగతిని నిర్ధారించడానికి తవ్వకం పద్ధతిని తగిన విధంగా అనుసరించడానికి వీలు కల్పిస్తుందని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో 2027నాటికి పనులకు ఎలాగైనా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం నిర్దేశించారు. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలను లెక్కచేయకుండా ప్రజలకు, రైతులకు మంచి జరగాలన్న తపనతో సీఎం రేవంత్ రెడ్డి SLBC పనులకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుండటం విశేషం.

Also ReadCM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై వైమానిక సర్వే.. సీఎం రేవంత్, ఉత్తమ్ చేతుల మీదుగా లాంచింగ్

కీలకమైన ఎస్ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రాజెక్టుపై ఉన్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు 200 కిలోమీటర్ల వైమానిక వ్యాప్తిలో ఈ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ద్వారా టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు వీలవుతుంది. ఈ పని కోసం రక్షణ శాఖకు చెందిన రెండు ప్రత్యేక హెలికాప్టర్లను వినియోగించనున్నారు. వాస్తవానికి, 1983లో ప్రారంభమైన ఆలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్ట్ (ఏఎంఆర్‌పీ) ద్వారా నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, ఫ్లోరైడ్ నిర్మూలనకు ఉపయోగపడుతుందని భావించారు. ఇందులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ నుంచి సుమారు 43.93 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ తవ్వకానికి ప్లాన్ చేశారు.

నీటి ఊట, ప్రమాదాలతో బ్రేక్

ప్రస్తుతం ఈ టన్నెల్ లోపలి వైపు 13.94 కిలోమీటర్ల పొడవు తవ్వగా, దేవరకొండ వైపు 20.4 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అయితే, తవ్వకాల్లో భారీగా సీపేజ్ వాటర్ (నీటి ఊట) రావడంతో పనులు నిలిచిపోయాయి. అంతేకాక, ఇటీవల జరిగిన ఒక ప్రమాదం కూడా తవ్వకాలకు బ్రేకులు వేసింది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి, అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు పూర్తయితే, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలోని దాదాపు 1.07 లక్షల హెక్టార్లకు సాగునీరుతో పాటు, 517 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు కూడా ఈ టన్నెల్ వీలు కల్పిస్తుంది.

Also ReadCM Revanth Reddy: బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటరును కలవాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రివ్యూ

Just In

01

Dharmapuri Arvind: ఇప్పటి వరకు ఎక్కడా పాల్గొనని ఎంపీ అరవింద్.. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమే కారణమా?

Cyber Fraud: హర్ష సాయి పేరిట సైబర్ టోకరా.. ఇరాక్‌లో ఉన్న యువకుడికి రూ.87 వేలు మోసం!

King 100 movie: నాగార్జున వందో సినిమాకు ముగ్గురు హీరోయిన్లా.. షూట్ ఎప్పటినుంచంటే?

Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Naveen Yadav: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గర్జన.. ప్రచార జోరు పెంచిన నవీన్