Doctor Murder Case: బెంగళూరులో ఓ మహిళా డాక్టర్ హత్య కేసులో (Doctor Murder Case) షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన భార్యను హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను ప్రశ్నించగా అతడు అసలు నిజాన్ని అంగీకరించాడు. తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్య చేసిన కొన్ని వారాల తర్వాత ‘నా భార్యను హత్య చేసింది నీకోసమే’ అంటూ కనీసం నలుగురు, ఐదుగురు మహిళలకు నిందితుడు మెసేజులు పంపించినట్టుగా పోలీసు విచారణలో బయటపడింది. నిందితుడు డాక్టర్. మహేంద్ర రెడ్డి ఈ మెసేజులను పేమెంట్ యాప్ ఫోన్‌పే ద్వారా పంపించినట్టుగా గుర్తించామని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ మెసేజులు పంపించినవారిలో ఒకరు వైద్య నిపుణురాలు కూడా ఉన్నారు. మహేంద్ర రెడ్డి ప్రేమను గతంలో ఆమె తిరస్కరించారని వివరించారు. నిందితుడి ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి డేటాను రికవరీ చేసి, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి విశ్లేషణకు పంపడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. భార్య మరణించడంతో పాత సంబంధాలను తిరిగి మొదలుపెట్టడానికి నిందితుడు తీవ్రంగా ప్రయత్నించినట్లు అర్థమవుతోందని చెప్పారు.
Read Also- NC24 Meenakshi first look: నాగచైతన్య ‘NC24’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..
హత్యకు గురైంది కూడా వైద్యురాలే
మహేంద్ర రెడ్డి హత్య చేసిన ఆయన భార్య కృత్తిక. ఆమె కూడా వైద్యురాలే. డెర్మటాలజిస్ట్ అయిన ఆమెను ప్రణాళికాబద్ధంగా చికిత్స పేరిట హత్య చేశాడు. ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే ఉపయోగించాల్సిన ప్రొపోఫాల్ అనే అనస్థీషియాను ఆమెకు ఎక్కించి హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ నెలలో నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో ఇద్దరూ కలిసి పనిచేశారు. 2024 మే 26న పెళ్లి చేసుకున్నారు. కనీసం ఒక ఏడాది కూడా తిరిగకుండానే కృత్తికను మహేంద్ర రెడ్డి హత్య చేశాడు. అనారోగ్య సమస్యలతో మారాథహళ్లిలో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన కృత్తిక ఈ ఏడాది ఏప్రిల్ 23న ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపడింది. ఆమెను చూడానికి వెళ్లిన మహేంద్ర వరుసగా 2 రోజుల పాటు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చికిత్సలో భాగంగా ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పాడని, అయితే, దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టుగా ప్రకటించారు.
Read Also- Vakiti Srihari: చేపపిల్లలు చెరువుకు చేరాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి వాకిటి శ్రీహరి
అససహజ మరణంగా అనుమానం
కృత్తిక చనిపోయిన తీరుపట్ల పోలీసులు ‘అన్-నేచురల్ డెత్ రిపోర్ట్’ నమోదు చేశారు. ఇదే సమయంలో కృత్తిక అక్క డా.నిఖితకు అనుమానం వచ్చింది. మహేంద్ర రెడ్డిపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. దీంతో, విచారణ మొదలుపెట్టగా కృత్తిక శరీరంలోని పలు అవయవాలలో ప్రొపోఫాల్ ఉన్నట్టుగా ఆరు నెలల తర్వాత నిర్ధారించారు. దీంతో, కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు విచారణ జరిపారు. కృత్తిక మరణం తర్వాత ఉడిపిలోని నగరశివారు ప్రాంతం మణిపాల్‌లో ఉంటున్న మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడికి గతంలో కూడా నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. అతడి సోదరులకు కూడా నేరాల బ్యాగ్‌గ్రౌండ్ ఉందని వివరించారు.
