GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: మార్చి కల్లా మరో 35 బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లు..పేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో సంచలనాత్మక నిర్ణయం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అర్థాకలితో అలమటించ వారి ఆకలి తీర్చేందుకు రూ.5 కే భోజనం పథకం అన్న పూర్ణ స్కీమ్ ను ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ (GHMC) పేదల ఆకలి తీర్చేందుకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నాం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వారికి కేవలం రూ.5 కే టిఫిన్ అందించేందుకు గడిచిన రెండు నెలల్లో 35 బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లను ప్రారంభించిన జీహెచ్ఎంసీ వచ్చే మార్చి నెలాఖరు కల్లా మరో 35 బ్రేక్ పాస్ట్ క్యాంటీన్లను ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తుంది.

Also ReadGHMC: జీహెచ్ఎంసీ పాలక మండలికి 100 రోజులే.. సంపాదన ప్రయత్నాల్లో మునిగిన కార్పొరేటర్లు!

35 క్యాంటీన్లను అందుబాటులోకి

రెండు నెలల క్రితం బోరబండ మోతీనగర్, ఐమాక్స్ ధియేటర్ ప్రాంతాల్లో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజియలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్ల సంఖ్య క్రమంగా ఇపుడు 35కు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తొలి దశగా అందుబాటులోకి వచ్చిన 35 క్యాంటీన్లు ప్రతి రోజు ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర, తొమ్మిది గంటల వరకు వివిధ రకాల ఆరోగ్యవంతమైన, హైజెనిక్ టిఫిన్లను కేవలం రూ.5 కే జనానికి అందిస్తున్నాయి. తొలి దశగా 70 టిఫిన్ క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావించిన జీహెచ్ఎంసీ వచ్చ మారి నెలాఖరు కల్లా మరో 35 ప్రాంతాల్లో అదనంగా 35 క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్దం చేసింది.

ప్రతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా

ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందిస్తున్నారు. ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్స్ అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందిస్తున్నారు. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 క్యాంటనీలను ఏర్పాటు చేయాలని భావించిన జీహెచ్ఎంసీ ఇపుడు ఆ సంఖ్యను 70 కి కుదించుకుంది. ప్రతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరం

బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారిందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఈ ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కీలక పరిణామమని అధికారులు భావిస్తున్నారు. కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు మరో సారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో చేసుకున్న ఒప్పంధం ప్రకారం పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేసిన ఈ ఒక్కో టిఫిన్ కు మొత్తం రూ. 19 ఖర్చవుతుండగా, ఇందులో రూ.5 ప్ర్రజల నుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ భరిస్తుంది.

Also Read: GHMC: మహిళా సాధికారతకు కొత్త రూపు.. యువతులకు ఎస్‌హెచ్‌జీల్లో అవకాశం!

Just In

01

MP Raghunandan Rao: జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం: ఎంపీ రఘునందన్ రావు

Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Pithapuramlo: పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘పిఠాపురంలో అలా’

Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు

Medak District: పౌష్టికాహారం రాజకీయ పథకం కాదు.. రాజ్యాంగ హక్కు: శ్రీనివాస్ రెడ్డి