Rajasthan Accident: మరో ఘోర ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
Rajasthan Accident (Image Source: twitter)
జాతీయం

Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు

Rajasthan Accident: రాజస్థాన్ లోని జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోహామండి రోడ్డు (Lohamandi Road)లో వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి అనేక వాహనాలను ఢీకొట్టింది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ముందున్న ద్విచక్ర వాహనాలు, కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఘటనాస్థలిలో భీతావాహ పరిస్థితులు తలెత్తాయి.

మద్యం మత్తులో డ్రైవర్..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ట్రక్కు డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రక్కుపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ అర కిలోమీటర్ వరకూ దూసుకెళ్లినట్లు సమాచారం. కాగా ప్రమాద అనంతర దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసుల అదుపులో డ్రైవర్

ప్రమాదంలో గాయపడిన వారిని జైపూర్ లోని సవాయి మాన్సింగ్ ఆస్పత్రికి అధికారులు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ట్రక్ డ్రైవర్ ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు మద్యం సేవించి ట్రక్కు నడిపాడా? లేదా? అని నిర్దారించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇది రాజస్థాన్ లో 24 గంటలు వ్యవధిలో జరిగిన రెండో పెద్ద రోడ్డు ప్రమాదం.

Also Read: Bus Accidents In Telangana: తెలంగాణలో జరిగిన భయంకర బస్సు ప్రమాదాలు.. ఇవి ఎప్పటికీ పీడకలే!

యాత్రికుల బస్సుకు ప్రమాదం

ఆదివారం రాత్రి ఫాలోడీ జిల్లాలోని మాటోరా ప్రాంతంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌ నుంచి బికనేర్ జిల్లా కోలాయత్ వైపు వెళ్తున్న యాత్రికులతో వెళ్తోన్న టెంపో ట్రావెల్ బస్సు రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది యాత్రికులు మృతి చెందారు. మృతులంతా జోధ్‌పూర్‌లోని సూరసాగర్ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కారణంగా యాత్రికుల బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కును గమనించని డ్రైవర్ దానిని వెనకనుంచి ఢీకొట్టాడు.

Also Read: Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Just In

01

BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!

Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం