Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో హృదయవిదారక అంశాలు వెలుగుచూస్తున్నాయి. బస్సును కంకరతో వెళ్తొన్న టిప్పర్ ఢీకొనడంతో ఇప్పటివరకూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం విషాదాన్ని మరింత పెంచుతోంది. ప్రమాదానికి ముందు వరకూ ఎంతో సరదా ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సొంతూరు నుంచి వెళ్తూ..
వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ గాంధీనగర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు తనూష, సాయి ప్రియ, నందిని ఈ దుర్ఘటనలో మృతి చెందారు. వీరు హైదరాబాద్ లోని కోఠి మహిళా కాలేజీలో చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా సాయిప్రియ ఫైనల్ ఇయర్, తనూష ఎంబీఏ చేస్తోంది. ఈ నెల 15న జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు తాండూరుకు వచ్చారని పేర్కొన్నారు. పెళ్లిలో ఎంతో సరదాగా గడిపారని కన్నీటిపర్యంతమవుతున్నారు. తండ్రి ఎల్లయ్యగౌడ్ కు మెుత్తం 4 ఆడపిల్లలు కాగా.. పెద్ద కుమార్తెకు గతంలో వివాహం చేశారు. ముగ్గురు కుమార్తెలను జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు చదివిస్తున్నారు. ఇంతలో బస్సు ప్రమాదం జరిగి ముగ్గురు కుమార్తెలు మరణించడంతో ఎల్లయ్యగౌడ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు..
మృతులు తాండూరుకు చెందిన నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయి ప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ)గా గుర్తింపు
బంధువుల పెళ్లి కోసం ఇటీవల హైదరాబాద్ నుంచి సొంతవూరుకు వచ్చిన అక్కా చెల్లెళ్లు
హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమై… pic.twitter.com/NK2i3aq72F
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025
ఎంబీఏ విద్యార్థిని మృతి
మరోవైపు ఇదే బస్సు ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థిని అఖిలరెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయింది. యాలల మండలం లక్ష్మీనారాయణ పూర్ కు చెందిన అఖిలరెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మరణవార్త వినగానే కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుమార్తెను కడసారి చూసుకునేందుకు హుటాహుటీనా చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలి వచ్చారు. అఖిలరెడ్డి కుటుంబం ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: BCCI Cash Reward: ప్రపంచ విజేతగా ఉమెన్స్ టీమ్.. బీసీసీఐ అదిరిపోయే క్యాష్ ప్రైజ్.. ఎన్ని రూ.కోట్లంటే?
మృతదేహాల అప్పగింత
చేవెళ్ల ప్రమాద స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. ఇప్పటివరకూ 13 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో 20 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రమాదం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు సీపీ మహంతి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక సమస్యల వల్ల రోడ్డు విస్తరణ పనులు ఆలస్యమైనట్లు చెప్పారు.
చేవెళ్ల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి..
19 మంది మృతి చెందగా.. 13 మృతదేహాలను గుర్తించాం
పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించాం
మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో 20 మంది చికిత్స పొందుతున్నారు
రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి
ప్రమాదానికి గల… pic.twitter.com/Dzevw0BUCb
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025
