CMS-03-Satelite (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

ISRO CMS-03: 4,410 కేజీల ఉపగ్రహాన్ని మోసుకొని నింగిలోకి దూసుకెళ్లిన బహుబలి రాకెట్

ISRO CMS-03: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆదివారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహల్లో కల్లా అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన సీఎంఎస్-03 (CMS-03)ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ‘బాహుబలి’గా అభివర్ణించే శక్తివంతమైన ఎల్‌వీఎం-3 (LVM-3) రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:26 గంటలకు ప్రయోగించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ దూసుకెళ్లింది. ప్రయోగించిన 16 నిమిషాలకు అంతరిక్షంలో ఎల్‌వీఎం-3 నుంచి శాటిలైట్ విడిపోయింది. ఇంత బరువైన ప్రయోగాన్ని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపట్టారు. ఈ శాటిలైట్ సేవలు అందుబాటులోకి వస్తే సముద్ర కమ్యూనికేషన్లలో నూతన శకం మొదలైనట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశ స్వదేశీ ఉపగ్రహ సామర్థ్యాలు, సముద్ర భద్రతకు సంబంధించి ఒక ముఖ్యమైన ముందడుగు అని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also- Baahubali The Epic Collections Day 2: ‘బాహుబలి: ది ఎపిక్’ రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

నేవీ కమ్యూనికేషన్ గ్రిడ్‌కు ఊతం

సీఎంఎస్-03 శాటిలైట్‌ను జీశాట్7ఆర్ (GSAT-7R) అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మహాసముద్రం అంతటా ఇండియన్ నేవీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు వెన్నెముకలా పనిచేసేలా ఈ శాటిలైట్‌ను తయారు చేశారు. ఇందులో సీ, ఎక్స్‌టెండెడ్ సీ, కేయూ బ్యాండ్‌లతో పాటు మల్టీ-బ్యాండ్ పేలోడ్‌లు ఉన్నాయి. ఇవి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తీరప్రాంత కమాండ్ కేంద్రాల మధ్య సురక్షితమైన, అధిక-సామర్థ్యంతో వాయిస్, డేటా, వీడియో ట్రాన్స్‌మిషన్స్‌ను సాధ్యం చేస్తాయి. శాటిలైట్ పాత వెర్షన్ జీశాట్-7 (రుక్మిణి)తో పోల్చితే, సీఎంఎస్-03 ఎక్కువ కవరేజీని, బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. ఈ శాటిలైట్ మారుమూల ప్రాంతాలు, వివాదాస్పద సముద్ర తలాలపై కూడా రియల్-టైమ్ కనెక్టివిటీని కచ్చితత్వంతో అందిస్తుంది.

Read Also- India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా సునాయాస విజయం

సీఎంఎస్-3 శాటిలైట్ నెట్‌వర్క్-సెంట్రిక్ నౌకాదళ కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుంది. సముద్ర పరిస్థితులపై నేవీకి అవగాహనను పెంచుతుంది. భారత బ్లూ-వాటర్ ఆశయాలకు (సముద్ర లక్ష్యాలు) ఎంతగానో తోడ్పడుతుంది. సముద్రంలో దూర ప్రాంతాలలో బెదిరింపులు ఎదురైనా సమన్వయంతో ప్రతిస్పందించడానికి, నౌకాదళం మధ్య మరింత సమన్వయానికి దోహదపడుతుంది. సురక్షితమైన సమాచార మార్పిడికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే, ఈ నేవీ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ గ్రిడ్‌లో ఈ శాటిలైట్ ఒక ముఖ్యమైనదిగా నిలుస్తుంది.

సీఎంఎస్-03 శాటిలైట్ కవరేజీ భారత ఉపఖండంతో పాటు చుట్టుపక్కల ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సాధారణ భూ-ఆధారిత నెట్‌వర్క్‌ల పరిధికి మించి అని చెప్పారు. నిరంతరాయం జియోసింక్రోనస్ పొజిషన్‌లో ఉండటంతో సాయుధ దళాలకు, డిజాస్టర్ రెస్పాన్స్, రిమోట్ సెన్సింగ్, టెలిమెడిసిన్‌లో సేవలు అందించే ఏజెన్సీలకు నిరంతరాయమైన, సురక్షితమైన కమ్యూనికేషన్స్‌ను అందిస్తుందని వివరించారు.

Just In

01

Bus Accidents In Telangana: తెలంగాణలో జరిగిన భయంకర బస్సు ప్రమాదాలు.. ఇవి ఎప్పటికీ పీడకలే!

Dharmapuri Arvind: ఇప్పటి వరకు ఎక్కడా పాల్గొనని ఎంపీ అరవింద్.. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమే కారణమా?

Cyber Fraud: హర్ష సాయి పేరిట సైబర్ టోకరా.. ఇరాక్‌లో ఉన్న యువకుడికి రూ.87 వేలు మోసం!

King 100 movie: నాగార్జున వందో సినిమాకు ముగ్గురు హీరోయిన్లా.. షూట్ ఎప్పటినుంచంటే?

Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి