XY Movie: కొన్ని సినిమాలు పోస్టర్స్‌తోనే మంచి అంచనాలను పెంచేస్తాయి. అలాగే సినిమా సక్సెస్‌లో పెద్ద పీట వేసేవి టైటిల్స్ అనే విషయం కూడా తెలియంది కాదు. ఇప్పుడో వెరైటీ టైటిల్‌తో రాబోతున్న చిత్రం టాలీవుడ్ వర్గాల్లో మంచి ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై రతిక (Rathika Ravinder) ప్రధాన పాత్రలో.. సి.వి. కుమార్ (C V Kumar) రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్స్ వై’ (XY Movie). డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ఎక్స్‌పరిమెంటల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా కథ ఏంటి? అసలు బ్యాక్ డ్రాప్ దేనిపై? అనే విషయాలను రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచేలా మోషన్ పోస్టర్‌ను కట్ చేశారు. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
Also Read- Akhanda 2 Thaandavam: ‘బ్లాస్టింగ్ రోర్’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
మాయావన్ సినిమాటిక్ యూనివర్స్
ఈ మోషన్ పోస్టర్‌ను (XY Movie Motion Poster) గమనిస్తే.. టీ బౌల్, కెమెరా, కీటకం, మెదడు, డీఎన్ఏ, ఆ తర్వాత రాక్షసుడి రూపం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫైనల్‌గా ఓ కన్నులో నుంచి టైటిల్‌ను రివీల్ చేసిన తీరు కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ‘ఎక్స్ వై’ టైటిల్‌తో పాటు ఇది ‘మాయావన్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU) అని చెప్పడం చూస్తుంటే.. ఈ మూవీ ఒక్క పార్ట్‌తో పూర్తయ్యే సినిమా అని అనిపించడం లేదు. సైంటిఫిక్‌గా వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని ఈ మోషన్ పోస్టర్‌తోనే మేకర్స్ రివీల్ చేశారు. ఇంకా సినిమాకు సంబంధించి ఇతర కంటెంట్ ఏదైనా వస్తే మాత్రం.. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో..
సి.వి. కుమార్ విషయానికి వస్తే.. ఆయన ఎప్పుడూ కూడా ‘పిజ్జా, సూదు కవ్వమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ ఉంటారు. దర్శక, నిర్మాతగా సి.వి. కుమార్ మరోసారి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ‘ఎక్స్ వై’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ కృష్ణ సంగీతాన్ని అందిస్తుండగా, హరిహరణ్ ఆనందరాజా కెమెరామెన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉంటుందనే విషయం ఈ మోషన్ పోస్టరే తెలియజేస్తుంది. అలాగే రతికకు మంచి పేరు తెచ్చే సినిమా ఇదవుతుందని, త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
