Zoho-Payment (Image source Twitter)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Zoho Payments: ‘జోహో పే’ వచ్చేస్తోంది.. గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లు ఎటువైపు మొగ్గుతారో?.. ఫీచర్లు ఇవే

Zoho Payments: భారతీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్‌పే, ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు బాగా చేరువయ్యాయి. అయితే, సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రసిద్ధి చెందిన, చెన్నైకి చెందిన సంస్థ ‘జోహో’ (Zoho Payments) కొత్తగా డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి  ప్రవేశిస్తోంది. ఇప్పటికే దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్‌పే, ఫోన్‌పే వంటి దిగ్గజాలకుతో పోల్చితే ‘జోహో పేమెంట్స్’ ఏ విధంగా విభిన్నం?, ఇందులో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏమిటి?, వినియోగదారులకు దక్కే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

జోహో పే కేవలం మరొక యూపీఐ పేమెంట్ యాప్ కాదని జోహో కంపెనీ చెబుతోంది. ఇందులో చాలా ప్రత్యేకతలు, స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార, కమ్యూనికేషన్ అనుసంధానంతో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నవాటి కంటే భిన్నమైన స్థానాన్ని పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

‘చాట్ + పే’

సమగ్రమైన యాప్ ద్వారా పేమెంట్‌తో పాటు చాటింగ్ సౌలభ్యాన్ని కూడా అందించడం ఈ యాప్ ప్రత్యేకతగా నిలవబోతోంది. ఈ మేరకు పటిష్టమైన ప్రైవసీ ఉన్న మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘అరట్టై’కు (Arattai) దీనిని అనుసంధానం చేయనుంది. గూగుల్‌పే, ఫోన్‌పేతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం గూగుల్‌పే, ఫోన్‌పేలు ప్రధానంగా చెల్లింపుల యాప్‌లుగా పరిగణిస్తున్నారు.. వాటిలో కూడా చాట్ ఫీచర్ ఉన్నప్పటికీ, అది కేవలం లావాదేవీలకే పరిమితమవుతోంది. జోపేమెంట్‌లో మాత్రం ఇది చాలా ప్రత్యేకంగా అనిపించనుంది. కమ్యూనికేషన్, పేమెంట్స్ కలయికతో ఒక సూపర్-యాప్ మోడల్‌లో దీనిని రూపొందించనుంది. తద్వారా ఒకే ప్లాట్‌ఫామ్‌పై సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు సురక్షితంగా నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Read Also- Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

ప్రైవసీ విషయంలో భరోసా

భారతీయుల ప్రయోజనాలకు అతిముఖ్యమైన డేటా ప్రైవసీ విషయంలో ఈ యాప్ అధికంగా దృష్టి పెట్టనుంది. జోహో కంపెనీ తన సాఫ్ట్‌వేర్ విధానంలో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రకటనల ఆధారిత వ్యాపార మోడల్ కాకుండా, వినియోగదారుల డేటా భద్రతకు, గోప్యతకు అధిక ప్రాముఖ్యత ఇస్తోంది. డేటా ప్రైవసీ విషయంలో గూగుల్‌పే వంటి యాప్‌లు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. మేడ్-ఇన్-ఇండియా బ్రాండ్ అయిన జో పేమెంట్స్ అందుబాటులోకి వస్తే, కస్టమర్ల విశ్వాసం పెరగడం ఖాయంగా ఉంది. వ్యక్తిగత లావాదేవీలతో పాటు రికరింగ్ పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్ల చెల్లింపుల వంటి అధునాతన ఫీచర్లు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉండనుందని తెలుస్తోంది.

Read Also- Bigg Boss Telugu 9: రీ ఎంట్రీ.. శ్రీజ అరాచకం షురూ.. భరణికి బిగ్ బాస్ ముందస్తు వార్నింగ్!

వ్యాపారాలకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటికే జోహో బుక్స్ (Zoho Books), జోహో ఇన్వాయిస్ (Zoho Invoice), జోహో పేరోల్ (Zoho Payroll), జోహో కామర్స్ (Zoho Commerce) వంటి అనేక వ్యాపార నిర్వహణ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. అన్ని వ్యాపార యాప్‌లు సులభంగా, సజావుగా లింక్ అవుతాయి. ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయి. జోహో ఇప్పటికే ఆర్బీఐ నుంచి చెల్లింపుల అగ్రిగేటర్ లైసెన్స్ కూడా పొందింది. దీంతో, మల్టీపుల్ పేమెంట్ ఆప్షన్లు ఉంటాయి. యూపీఐ మాత్రమే కాకుండా, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, రూపే వంటి ఇతర చెల్లింపు విధానాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే, జోహో పేమెంట్ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు ప్రకటించాల్సి ఉంది.

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్