Seethakka ( image credit: swetcha reporter)
Politics

Seethakka: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం : మంత్రి సీతక్క

Seethakka:: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే వెయ్యి కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సీతక్క (Seethakka) వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో పుట్టలు గుట్టలు కష్టాలు తెలిసిన వ్యక్తి నవీన్ యాదవ్ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.  ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న నగర్ తో పాటు పలు బస్తీల్లో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు పట్టాలిస్తే అన్నా నగర్ బస్తీ ఏర్పాటైందన్నారు.

Also ReadSeethakka: ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం.. పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం : మంత్రి సీతక్క 

జీవో 58 కింద ఇండ్ల పట్టాల కోసం దరఖాస్తులు

కానీ గత 10 ఏళ్లలో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. జీవో 58 కింద ఇండ్ల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నా. వాటిని కూడా గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే బస్తీలో అందరికీ ఇళ్లు అందుతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు మేలు జరుగుతుందన్నారు. పనిచేసే నవీన్ కు ఓటు వేయడం వలన పేదలకు ఎన్నో రకాలుగా ఉపయోగం ఉన్నదన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో రూ.150 కోట్లతో అభివృద్ధికార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోలేదు 

ఇక గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చిన్న చిన్న దూరాలకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తారన్నారు. బీఆర్ఎస్ హయంలో ఆటో డ్రైవర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. స్వయంగా కేసీఆర్ ప్రగతిభవన్లోనే ఓలా, ఉబర్ బైక్ సర్వీసులను కేటీఆర్ ప్రారంభించి ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీశారన్నారు. నో పార్కింగ్, ఫిట్మెంట్ చార్జీలు పేరుతో ఆటో డ్రైవర్ల జేబులకు చిల్లులు పెట్టారన్నారు. తమ బాధలు చెప్పుకుందామంటే ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ నివాసం ప్రగతి భవనం ముందే ఆటో డ్రైవర్ తన ఆటో తగలబెట్టుకున్నాడని వివరించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు.

Also Read: Seethakka: అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం.. మంత్రి సీతక్క హెచ్చరిక!

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్