Press-Meet-Cancel
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Press Meet Cancel: రేపే భారత్‌తో మ్యాచ్.. ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న పాకిస్థాన్.. కారణం ఇదే!

Press Meet Cancel: ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆదివారం (సెప్టెంబర్ 21) నుంచి మొదలుకానున్నాయి. తొలి మ్యాచ్‌లో దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. అయితే, మ్యాచ్‌కు ముందు రోజు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ టీమ్ ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశాన్ని రద్దు (Press Meet Cancel) చేసుకుంది. భారత్-పాక్ మ్యాచ్‌ రిఫరీగా మళ్లీ ఆండీ పైక్రాఫ్ట్‌ను నియమించడం, హ్యాండ్‌షేక్ వివాదం నేపథ్యంలో ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు మీడియాతో మాట్లాడకూడదని భావించినట్టు తెలుస్తోంది. అందుకే, పాకిస్థాన్ మరోసారి ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, గత మ్యాచ్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదంలో మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్ కీలక పాత్ర పోషించారని పీసీబీ ఆరోపించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ వద్ద పీసీబీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా, మళ్లీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ అయిన ఆండీ పైక్రాఫ్ట్‌ను తదపరి భారత్-పాక్ మ్యాచ్‌కు నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ, ‘భారత్-పాక్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన అధికారిక మ్యాచ్ అధికారుల వివరాలను ఇంకా ప్రకటించలేదు.

Read Also- H1B visa fee hike: హెచ్-1బీ రూల్స్ మార్చిన ట్రంప్.. ఆకాశాన్ని తాకిన భారత్-అమెరికా విమాన టికెట్ రేట్లు!

గత ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు పైక్రాఫ్ట్‌నే రిఫరీగా వ్యవహరించారు. ఆ మ్యాచ్‌లో టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వొద్దంటూ పాక్ కెప్టెన్‌కు మ్యాచ్ రిఫరీ చెప్పారని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ మేరకు ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ ఐసీసీకి పీసీబీ రెండు మెయిల్స్ కూడా పంపించింది. పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ మొత్తానికే తొలగించాలని తొలుత కోరింది. ఆ తర్వాత తమ మ్యాచ్‌ల నుంచైనా తప్పించాలని విజ్ఞప్తి చేసింది. కానీ, ఐసీసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Read Also- Telugu movies Oscar 2025: ఆస్కార్ రేసులో ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడుతున్న తెలుగు చిత్రాలు ఇవే..

ఈ రెండు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. ఆండీ పైక్రాఫ్ట్‌ పాత్ర పరిమితమని, ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ, పీసీబీ అభ్యంతరాలు అన్నింటినీ తోసిపుచ్చింది. కాగా, ఆండీ పై‌క్రాఫ్ట్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని పీసీబీ ఆరోపించింది. ‘నో హ్యాండ్‌షేక్’ వ్యవహారంలో ఒక మ్యాచ్ రిఫరీగా ఆయన పాత్ర చాలా పరిమితమని, ఆయనపై ఆరోపణలు చేయడం సబబుకాదని ఐసీసీ పేర్కొంది. ‘నో హ్యాండ్‌షేక్’ సమాచారం కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే పైక్రాఫ్ట్‌కు అందిందని, ఇందులో ఆయన తప్పేమీ లేదని వివరణ ఇచ్చింది.

పైక్రాఫ్ట్–పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ భేటీ

ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నాల్లో భాగంగా ఆడీ పైక్రాఫ్ట్, పాక్ జట్టు మేనేజ్‌మెంట్ మధ్య ఐసీసీ ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, హెడ్ కోచ్ మైక్ హెస్సన్, మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైక్రాఫ్ట్ మాట్లాడుతూ, హ్యాండ్‌షేక్ లేదనే సమాచారాన్ని సకాలంలో చేరవేయనందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. అందుకు ఆయన క్షమాపణలు కూడా కోరారు. అయినప్పటికీ పాకిస్థాన్ జట్టు సంతృప్తి చెందకపోవడం గమనార్హం.

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?