India vs Oman: ఆసియా కప్-2025లో (Asia Cup-2025) భాగంగా భారత్-ఒమన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్ 188 పరుగులు సాధించింది. దీంతో, ప్రత్యర్థి ఒమన్ విజయలక్ష్యంగా 189 పరుగులుగా ఉంది.
రాణించిన సంజూ శాంసన్
ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ రాణించాడు. అర్ధ శతకంతో అదరగొట్టాడు. 45 బంతులు ఎదుర్కొని 56 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ నిలకడగా రాణించాడు. శాంసన్ తర్వాత అత్యధికంగా ఓపెనర్ అభిషేక్ శర్మ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడి తర్వాత తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
అయితే, ఓపెన్ శుభ్‌మన్ గిల్ 5 పరుగులు, హార్ధిక్ పాండ్యా 1, శివమ్ దూబే 5, హర్షిత్ రాణా 13 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ 1 పరుగులు మాత్రమే సాధించి విఫలమయ్యారు.
Read Also- Hyderabad: ముంపు నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తాం.. హైదరాబాదీలకు మంత్రి వివేక్ హామీ
తలో రెండేసి వికెట్లు తీసిన ఒమన్ బౌలర్లు..
ఒమన్ బౌలర్లు ఫర్వాలేదనించారు. ముగ్గురు బౌలర్లు రెండేసి చొప్పున వికెట్లు తీశారు. షా ఫైసల్, జితెన్ రమణండి, ఆమీర్ కలీం తలో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో తీశారు.
Read Also- Kadiyam Srihari: కడియం రాజీనామాపై పోస్టర్లు.. రఘునాథపల్లిలో రాజుకుంటున్న రాజకీయ చిచ్చు
బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ సూర్య
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్య బ్యాటింగ్‌కు దిగలేదు. జట్టు డెప్త్ తెలుసుకుంటామని టాస్ సమయంలో చెప్పినట్టుగానే, గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ అవకాశం దక్కని ఆటగాళ్లను ముందుకు ప్రమోట్ చేశాడు. దీంతో, బ్యాటింగ్‌కు దిగలేదు. ఇప్పటికే గ్రూప్-4 దశకు చేరుకున్నందున ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు రిలాక్స్డ్‌గా ఆడారు. కాగా, టాస్ సమయంలో సూర్య మాట్లాడుతూ, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ టోర్నీలో తాము ఇప్పటివరకు ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదని, అందుకే, బ్యాటింగ్ డెప్త్‌ను అర్థం చేసుకోవాలనుకుంటున్నామని అన్నాడు. సూపర్-4 మ్యాచ్‌లకు ముందు జరిగే ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తాము అనుసరించిన వాటినే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. పిచ్ బాగానే కనిపిస్తోందని, తమ ఓపెనర్లు చక్కగా రాణిస్తారని భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, ఆసియా కప్-2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సూర్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Read Also- K-Ramp teaser: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్..