Ministers Seethakka: పిల్లలకు హైదరాబాద్(Hydrabad) ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి(Min Seethakka) అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) ప్రకటించారు. క్లాప్ ఫర్ చిల్డ్రన్(Clap for Children) పోస్టర్ను సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ‘క్లాప్ ఫర్ చిల్డ్రన్ – పిల్లల భద్రత కోసం నగర స్థాయి కార్యాచరణ ప్రణాళిక’ను తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రారంభిస్తుంది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, పిల్లలకి సురక్షిత నగరంగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇతర నగరాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామన్నారు.
Also Read: Deepika Padukone: వరుసగా రెండో షాక్.. కల్కి 2 నుంచి దీపిక పదుకొనే ఔట్..
చట్టపరమైన సంస్థలు
ఈ ప్రయత్నంలో యూనిసెఫ్(Unisef) సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు, సమాజం కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. చట్టపరమైన సంస్థలు, ఫ్రంట్‌లైన్(Front Line) సేవలను బలోపేతం చేసి, మహిళా- శిశు సంక్షేమ, పోలీసు, ఆరోగ్యం, విద్య, కార్మిక, జీహెచ్ఎంసీ(GHMC) వంటి విభాగాల సమన్వయంతో బుల్లీయింగ్, ఈవ్-టీజింగ్, అసురక్షిత రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు..
బాలల రక్షణ సెల్‌లు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుందని, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, పిల్లలకు అనుకూలమైన, శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యూనిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డా. జెలాలెం బిర్హాను టాఫెస్సే తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hydra Ranganath: హైదరాబాద్‌లో జోరు వర్షం.. రంగంలోకి హైడ్రా కమిషనర్.. కీలక ఆదేశాలు జారీ