Vemsoor Tahsildar Office: వేంసూర్ తహసిల్దార్ కార్యాలయం (Vemsoor Tahsildar Office)లో రోజుకో బాగోతం బయటపడుతుంది. ఇంతకాలం అక్రమ అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు, పట్టా పొందడం, భార్య విధుల్లో భర్త ఉంటే 11 ఏళ్లుగా అధికారులు ఏం చేస్తున్నారోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేంసూర్ తహసిల్దార్ కార్యాలయం ( (Vemsoor Tahsildar Office))లో గత ఐదు రోజుల క్రితం అక్రమంగా అసైన్డ్ భూములను ప్రభుత్వ ఉద్యోగిని కోలా బేబీ కొనుగోలు చేసిన విషయంపై స్వేచ్ఛలో ప్రచురితమైంది. కల్లూరు అడిషనల్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్పందించినప్పటికీ సంబంధిత ఉద్యోగినిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అలా.. వేంసూర్ తాసిల్దార్ కార్యాలయంలో
అలా వేంసూర్ తహసిల్దార్ కార్యాలయంలో మరో బాగోతం బయటపడింది. భార్య షేక్ యాకూబ్బి ఉద్యోగ విధులను భర్త యాకూబ్ నిర్వహిస్తున్నారు. ఇది ఒకటి రెండు ఏళ్లు కాదు దాదాపు 11 ఏళ్లుగా భార్య ఉద్యోగ విధులను భర్త నిర్వర్తిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో.. ఇట్టే అర్థమయిపోతుంది. 2014లో కిందిస్థాయి ఉద్యోగినిగా నియమితులైన షేక్ యాకూబ్బి బదులు భర్త యాకూబ్ ఉద్యోగ విధులను నిర్వర్తిస్తూ వస్తున్నాడు. ఇదే విషయమై వేంసూర్ మండలంలో తీవ్ర చర్చ జరుగుతుంది. గత వారం రోజుల క్రితం జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బేబీ అసైన్డ్ భూములను అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరిట పట్టా చేయించి ప్రభుత్వ ఉద్యోగానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.
Also Read: Anganwadi Salary Hike: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి.. మంత్రి సీతక్కకు విజ్ఞప్తి
అధికారులకు ఈ విషయం ఇప్పటికీ అర్థం కాలేదా..?
సర్వీస్ రూల్స్ ప్రకారం నియమితులైన వ్యక్తి తప్ప మరెవ్వరు విధులు నిర్వర్తించేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అయినప్పటికీ ఇంతకాలం అక్రమంగా భార్య ఉద్యోగ విధులను భర్త నిర్వర్తిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న అధికారులకు ఈ విషయం ఇప్పటికీ అర్థం కాలేదా..? అయితే ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అనే చర్చ మండలంలో విస్తృతంగా సాగుతోంది. సంబంధిత వీడియోలో భార్య విధులను భర్త నిర్వర్తిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం భార్య పేరుట ఉండడంతో ఉదయం ఆమెను కార్యాలయానికి తీసుకొచ్చి సంతకం చేయించి తిరిగి ఇంటికి పంపుతున్నాడు. తర్వాత సమయం మొత్తం భర్త విధులు నిర్వర్తిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది.
అక్రమాలపై పూర్తి వివరాలు వెలుగులోకి?
వేంసూర్ రెవెన్యూ కార్యాలయంలో కొనసాగుతున్న అక్రమాలపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా విధుల్లో ఎవరు ఉంటున్నారని విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమైనా విషయమేమి కాదు.. కానీ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు రకాల చర్చకు దారితీస్తోంది. ఉద్యోగంలో ఉండవలసింది ఉద్యోగం పొందిన షేక్ యాకూబ్బి… కానీ విధులు నిర్వహించేది మాత్రం ఆమె భర్త షేక్ యాకూబ్. ఇన్ని సంవత్సరాలు ఇది కొనసాగుతుండగా ఒకసారి కూడా షేక్ జరీనా ఎందుకు తహసిల్దార్ కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నారు. భార్య బదులు భర్త యాకూబ్ నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: Kerala Crime: బాలుడిపై 14 మంది అత్యాచారం.. నిందితుల్లో పొలిటిషియన్, ప్రభుత్వ ఉద్యోగులు
భర్త భార్య ఉద్యోగ విధులు చెక్క పెడుతుంటే మీడియా కంట్లో పడలేదా..?
ఇంతకాలం ఈ వ్యవహారం బయటపడకపోవడం, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చూస్తే అధికారుల పాత్ర పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల మాటల్లో ఎమ్మార్వో నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు స్పందించకపోవడం అంటే ఇందులో వాళ్లకు ఏదో ప్రయోజనం ఉన్నట్టే కనిపిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇలా భర్త భార్య ఉద్యోగ విధులు చెక్క పెడుతుంటే మీడియా కంట్లో పడలేదా..? అంటే అర్థమేంటో తెలుసుకోవచ్చు. ప్రశ్నించిన వారందరికీ అమ్యామ్యాలను గుప్పిస్తూ ఉద్యోగుని యాకూబ్బీ విధులు భర్త యాకూబ్ చక్కబెడుతున్నాడు. వేంసూర్ తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న బాగోతాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక చొరవ తీసుకొని బాధ్యులపై తగిన శాఖపరమైన చర్యలు చేపట్టాలని వేంసూర్ మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అసైన్డ్ భూమిని అక్రమంగా తన కుటుంబ సభ్యులపై పట్టాలు చేయించిన జూనియర్ అసిస్టెంట్ కోలాబేబి విషయంలో కల్లూరు అదనపు కలెక్టర్ కు విషయం తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదో… జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Gadwal Collectorate: గద్వాల ప్రజాపాలన వేదికపై ఉద్రిక్తత.. గ్రంథాలయ చైర్మన్ ఆవేశం