Suryapet SP Narasimha ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Suryapet SP Narasimha: బ్యాంకులు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి.. జిల్లా ఎస్పీ కీలక సూచనలు

Suryapet SP Narasimha: బ్యాంకులు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. జిల్లా ఎస్పీ ఐపీఎస్ నర్సింహ గౌడ్ (Suryapet SP Narasimha Goud) అన్నారు. ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ తనకి నిర్వహించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సూర్యాపేట పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నందు భద్రత తనికి చేసిననారు.బ్యాంకుల నందు గల ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం బ్యాంక్ అధికారుల విధి, వాటి దుర్వినియోగానికి పాల్పడకూడదు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ను ఆకస్మికంగా సందర్శించి భద్రత, నిఘా ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు బ్యాంకు సిబ్బందికి రక్షణ పరమైన సూచనలు భద్రతా ఏర్పాట్లపై సలహాలు అందించారు.

 Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్?

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవస్థ ఉద్యోగులు కృషి చేయాలి 

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవస్థ ఉద్యోగులు కృషి చేయాలని ప్రజల యొక్క ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగానికి పాల్పడకూడదని సూచించారు. ప్రజలు వారి యొక్క ఆస్తులను ఎంతో నమ్మకంతో బ్యాంకుల్లో దాచుకుంటారని వాటికి సరైన రక్షణ కల్పాదించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులపై ఉన్నదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు పోలీసు అధికారులు తనిఖీ చేసి భద్రత చర్యలు పరిశీలించడం జరుగుతుందని అన్నారు.

అలారం సిస్టం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

బ్యాంకులకు బలమైన రక్షణ వలయం ఉండాలి, అత్యాధునికమైన అలారం సిస్టం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి, సెక్యూరిటీ సిస్టం సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఆదేశించారు. బ్యాంకులో ఎక్కడ కూడా మెగా లోపం ఉండకూడదని కోరారు, నగదు ఆభరణాల తరలింపులో అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బంగారం నగదు ఇతరత్రాలను కాపాడడంలో, రక్షణ కల్పించడంలో బ్యాంక్ సిబ్బంది బాధ్యతగా ఉండాలని తెలిపారు. బ్యాంకులకు వచ్చే వినియోగదారులకు సైబర్ మోసాల గురించి అర్థమయ్యేలా వివరించాలని ఏ బ్యాంకు అధికారి కూడా వినియోగదారునికి ఫోన్ చేసి ఆన్లైన్ నందు వివరాలు నమోదు చేయరు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, బ్రాంచ్ మేనేజర్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Pakistan Gym: పాక్ జిమ్‌లో దిక్కుమాలిన కసరత్తులు.. నవ్వి నవ్వి పోతే.. ఎవరు రెస్పాన్సిబిలిటీ!

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!