Pakistan Gym: సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జిమ్ వర్కౌట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి పాకిస్థాన్‌లోని జిమ్‌ల నుండి వచ్చినవని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రొటిన్ గా జిమ్ లో చేసే కసరత్తులకు భిన్నంగా ఈ వ్యాయమాలు ఉండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం జిమ్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. చాలా మంది కనీసం జిమ్ డ్రస్ కూడా వేసుకోకుండా నేరుగా కసరత్తులు చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కేబుల్ + డంబెల్ కాంబో
వైరల్ అవుతున్న జిమ్ వీడియోను గమనిస్తే.. ఓ వ్యక్తి ఒక చెత్తో డంబెల్ మరో చేతితో కేబుల్ పట్టుకొని.. స్క్వాట్స్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి వెనక పాక్ జెండా కూడా ఉండటం చూడవచ్చు. కేబుల్ స్ట్రెచ్ ను వెయిటెడ్ స్క్వాట్ తో కలిపి చేయడం ఆసక్తిక రేపుతోంది.
బుర్కాలో వ్యాయామం
అలాగే ఓ యువతి బుర్కాలోనే వ్యాయామం చేయడం కూడా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె డిక్లైన్ సిట్-అప్ బెంచ్‌ను వినూత్నంగా వాడింది. కాళ్లు బిగించి.. శరీరాన్ని పైకి కిందకి లేపడం చేసింది. అదే సమయంలో సరైన బాడీ పొజిషన్ లేకుండానే రెండు చేతుల్లోకి డంబెల్స్ తీసుకొని పైకి లేపడం చేసింది.
డంబెల్ బదులు స్టూల్స్
ఇదే వీడియోలో ఒక వ్యక్తి డంబెల్స్ కు బదులు స్టూల్స్ తీసుకొని షోల్డర్ ఎక్సర్ సైజ్ చేశాడు. సాధారణంగా షోల్డర్ రైజ్ కోసం డంబెల్ వాడతారు. కానీ ఇక్కడ అతను చేతిలో చిన్న స్టూల్స్ పట్టుకుని పైకి ఎత్తడం నవ్వులు పూయిస్తోంది.
గాల్లోకి లేచిన వ్యక్తి
చివరిలో ఒక వ్యక్తి నేలపై కూర్చుని చెస్ట్ వర్కౌట్ కోసం ఉపయోగించే కేబుల్స్ పట్టుకున్నాడు. వాటిని బలంగా లాగాల్సింది పోయి.. ఒక్కసారిగా వదిలేశాడు. దీంతో కూర్చున్న చోటు నుంచే అమాంతం పైకి లేశాడు.
View this post on Instagram
Also Read: Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!
నెటిజన్ల రియాక్షన్..
పాక్ జిమ్ లో చేస్తున్న కసరత్తులు చూసి నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘పాకిస్థాన్ కు ఒలింపిక్స్ మెడల్స్ ఎందుకు రావడం లేదో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం’ అని కామెంట్ చేశాడు. ఇంకొకరు ‘జోక్స్‌లోనైనా పాకిస్తాన్ ఎప్పుడూ నిరాశపరచదు’ అని అన్నారు. మరొకరు స్పందిస్తూ చేతిలో ఏ వస్తువు ఉంటే వాటితోనే వ్యాయామం చేయాలని జిమ్ ట్రైనర్ చెప్పి ఉండొచ్చని ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఈ వీడియో చూసి నవ్వి నవ్వి పోతే ఎవరిది రెస్పాన్సబిలిటీ’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.