Viral News: కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ సినిమా చేసేందుకు వెళ్లి.. తమ ఏడేళ్ల బిడ్డను టికెట్ కౌంటర్ వద్దే వదిలేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ఆ బిడ్డ.. గుక్కపెట్టి ఏఢుస్తూ అక్కడే ఉండిపోయాడు. బాబును గమనించిన థియేటర్ సిబ్బంది.. వెంటనే చేరదీశారు. బాబు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అసలేం జరిగిదంటే?
కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ‘లోక: చాప్టర్ 1 చంద్ర’ (lokah: chapter 1 chandra) చిత్రం చూసేందుకు కేరళ గురువాయూర్ లోని దేవకీ సినిమాస్ కు ఓ ఫ్యామిలీ ఎంతో ఉత్సాహంగా వెళ్లింది. తమతో పాటు ఏడేళ్ల బిడ్డను కూడా తీసుకెళ్లింది. అయితే ఆ బాలుడు టికెట్ కౌంటర్ లో క్యూలో ఏడుస్తూ ఉండటాన్ని సిబ్బంది గమనించారు. కుటుంబం నుంచి ఆ బాలుడు వేరైపోయినట్లు గుర్తించారు.
Also Read: Uttar Pradesh: ఇదెక్కడి విచిత్రంరా బాబు.. ఒకే ఇంట్లో 4 వేలకు పైగా ఓటర్లు
బాబుని వదిలేసి.. మరో థియేటర్‌కు
అయితే వ్యాన్ లో థియేటర్ కు వచ్చిన ఆ ఫ్యామిలీ టికెట్లు దొరక్క పోవడంతో మరో థియేటర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఏడేళ్ల బాలుడ్ని అక్కడే మర్చిపోయినట్లు సమాచారం. అయితే బాలుడ్ని థియేటర్ సిబ్బంది ప్రశ్నించగా.. తాను వ్యాన్ లో వచ్చినట్లు తెలియజేశాడు. దీంతో దగ్గరలోని పోలీసు స్టేషన్ లో బాలుడ్ని అప్పగించారు. అనంతరం దగ్గర లోక చిత్రం ఆడుతున్న థియేటర్ లో తప్పిపోయిన పిల్లాడి గురించి అనౌన్స్ చేయించారు. అక్కడే ఉన్న ఆ కుటుంబం ఆ ప్రకటన విని.. హడావిడీగా దగ్గరలోని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. తప్పిపోయిన బిడ్డన తమవాడేనని చెప్పి దగ్గరకు తీసుకున్నారు. పోలీసులు ఆ కుటుంబ సభ్యులను మందలించి వదిలేశారు.
Also Read: Teenmar Mallanna: తెలంగాణలో సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న.. పేరు ఏంటంటే?
లోక చిత్రానికి భారీ రెస్పాన్స్
మలయాళ ఇండస్ట్రీకి చెందిన ‘లోక: చాప్టర్ 1’ చిత్రం ఆగస్టు 28న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మహిళా సూపర్ హీరో ఫాంటసీతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫలితంగా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించింది. కేరళలోనూ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది.