Vijaya Dairy: పాడి కలిగిన ఇల్లు ఎల్లకాలం పచ్చగా వర్ధిల్లుతుందని విజయ డైరీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Gutta Amit Reddy) అభిప్రాయపడ్డారు. జనగామ పట్టణంలో విజయ పాల డైరీ సర్వసభ్య సమావేశం ధర్మారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న అమిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల డైరీ(Vijaya Milk Dairy) అధ్వర్యంలో పాల సేకరణ ముమ్మరంగా సాగుతుందన్నారు. ప్రైవేటు సంస్థల కన్నా అధికంగా పాడి రైతులుకు మేలు కలిగించే విధంగా విజయ డైరీ వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుందని వివరించారు. పాడి రైతులకు ఆవులు, గేదేల కొనుగోలుకు కోట్లాది రూపాయల సబ్సీడి అందిస్తుందని అన్నారు. పాడి రైతులకు అధిక ప్రోత్సాహకాలు ఇస్తుందని, బోనస్ రూపంలో అధికంగా ఇస్తున్నట్లు వివరించారు.
పాడి ఉత్పత్తి పట్ల మక్కువ
విజయ డైరీ తెలంగాణ రాష్ట్రంలో అధికంగా పాలను సేకరిస్తుందని అన్నారు. పాడి రైతులు తమ పశువులను కాపాడుకునేందుకు టీకాలను, పాల దిగుబడి పెంచుకునేందుకు దాణాను, మినరల్ మిక్చర్ ను అందిస్తుందని తెలిపారు. పాడి రైతులు పచ్చగా ఉంటే ఆ ఇల్లు కలకాలం పచ్చగా వర్ధిల్లుతుందనే సామెతను ప్రతి ఒక్కరు నిజం చేయాలన్నారు. ప్రతి రైతులు వ్యవసాయంతో పాటు పాడి ఉత్పత్తి పట్ల మక్కువ చూపితే ఆర్ధికంగా లాభాదాయకంగా ఉంటుందన్నారు. పాడి పశువులను పెంచడం ద్వారా పాల ఉత్పత్తితో పాటు పంటలకు ఎరువుగా పెంటను వాడుకోవచ్చన్నారు. దీంతో రైతులకు ఆధిక మేలు కలుగుతుందని అన్నారు.
Also Read: Sheep Distribution Scam: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు.. ప్రభుత్వ ఆమోదం లేకుండానే అమలు చేశారా?
మొదటగా జనగామ విజయ డైరీ
పాడి డైరీలను ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సీడీలను అందిస్తుందని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తరువాత మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మొదటగా జనగామ విజయ డైరీ గురించి, ఈ ప్రాంత పాడి పరిశ్రమ గురించి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసమే మాట్లాడనని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో సాగునీటికి ఏనాడు సమస్య రాలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సమస్య ఉత్పన్నం అయిందన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన అన్నారు. తాను ఎమ్మెల్యేగా పాడి పరిశ్రమ అభివృధ్ధికి, పాడి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానని అన్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో పాల శీతలీకరణ(Milk cooling) కేంద్రాన్ని ప్రారంభించారు. పాడి రైతులకు ఈ సందర్భంగా పాల క్యాన్లను అందించారు. ప్రతి ఒక్కరు పాల శీతల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Mallu Ravi:పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : ఎంపీ మల్లు రవి