Viral Video: ఇంటి పనుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇల్లు ఉడ్చే సందర్భాల్లో మనస్పర్థలు రావడం మనం సహజంగానే చూస్తుంటాం. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లో అలా జరగలేదు. ఓ పని విషయమై అత్తా, మేనకోడలి మధ్య చోటుచేసుకున్న వివాదం.. పరస్పర దాడికి దారి తీసింది. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే?
ఉత్తరాఖండ్ రుద్రపూర్ లో చోటుచేసుకున్న ఓ వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అత్తా, తన మేనకోడలి మధ్య ఓ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు గొడవపడ్డారు. కొద్దిసేపటికే అది పరస్పరం దాడికి దారి తీసింది. మేనకోడలి చేతిని అత్త నోటితో బలంగా కొరకడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఆపై ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని భౌతిక దాడికి దిగారు. ఈ సంఘటనలో గాయపడిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
उधमसिंह नगर से मारपीट का चौंकाने वाला वीडियो सामने आया है। सोशल मीडिया पर वायरल इस वीडियो में एक महिला युवती को थप्पड़ मारती दिख रही है, जबकि युवती बाल पकड़कर अपना बचाव करती नजर आती है। झगड़े के दौरान महिला ने युवती के हाथ पर दांत से काट भी लिया।युवती ने पुलिस को तहरीर देकर आरोप… pic.twitter.com/kgaLAgTK5v
— INH 24X7 (@inhnewsindia) September 15, 2025
Also Read: Vande Bharat: హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు.. ఏయే నగరాలకంటే?
ఫిర్యాదులో ఏం చెప్పిందంటే?
పని చేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి ఇంటి పనులు తానే చేస్తున్నానని.. ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్లను పోషించుకోవడానికి బయటకు వెళ్లి పనిచేస్తున్నట్లు చెప్పారు. తముళ్ల బాగోగులు చూసుకునేందుకు ఇలా చేస్తున్నట్లు తెలిపింది. అయితే తన మేనత్త ఇందుకు నిరాకరిస్తూ ఇంటి పట్టున ఉండి పనులు చేసుకోవాలని పట్టుబడుతోందని పోలీసులకు యువతి తెలిపింది.
Also Read: Team India Sponser: డ్రీమ్11 స్థానంలో కొత్త స్పాన్సర్ ఎంపిక.. ఏ కంపెనీయో తెలుసా?
రంగంలోకి పోలీసులు..
యువతి ఫిర్యాదుతో అత్తా కోడళ్ల వివాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాధిత యువతి ఆ ఇంటికి దత్తతగా వచ్చిందని.. పనుల విషయంలో అత్తతో తరుచూ విభేదాలు తలెత్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.