MLA Yashaswini Reddy: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) పలు కార్యక్రమాల్లో పాల్గొని, అభివృద్ధి సంక్షేమ రంగాల్లో పలు పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చారు.తాండా వాసుల కల నెరవేరల కొత్త బస్సు సర్వీస్ ప్రారంబించారు.రాయపర్తి మండలంలోని సూర్య తండా, ఎకే తండా గ్రామ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రవాణా సౌకర్యం నేడు ఫలించింది. వరంగల్ సూర్య తండా,ఎకే తండా,అన్నారం మీదుగా నడిచే కొత్త బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.ప్రతి విద్యార్థి, ఉద్యోగి, రైతు, మహిళా ప్రయాణం సులభతరం అవుతుంది. తండా గ్రామాల అభివృద్ధి నా కర్తవ్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అదే విధంగా రాయపర్తి మండల ఎంపీడీఓ(MPDO) కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 72 మంది లబ్దిదారులకు రూ.72,08,352 విలువైన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు, 34 మంది అనారోగ్య బాధితులకు రూ.14,03,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.పేదల పెళ్లిళ్లలో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా అవుతోంది అని ఆమె పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు రుణాల పంపిణీ
స్వర్ణభారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.4 కోట్లు 96 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలు మరియు మదర్ యూనిట్స్‌ను స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేశారు .మహిళలు బలపడితే కుటుంబం, సమాజం బలపడుతుంది. ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండేలా కృషి చేస్తాను అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.
Also Read; Almonds: బాదం తొక్కతో తినాలా.. తొక్క తీసేయాలా? షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు
తొర్రూరులో కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పండుగ
తొర్రూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 78 మంది లబ్ధిదారులకు రూ.78,09,048 విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. పేద కుటుంబాల పెళ్లిళ్లు గౌరవప్రదంగా జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని ఈ పథకాలు ఎన్నో కుటుంబాల్లో సంతోషం నింపుతున్నాయి అని ఆమె అన్నారు.
కొడకండ్లలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
కొడకండ్ల మండల రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు రూ.41,04,756 విలువైన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు, 21 మంది అనారోగ్య బాధితులకు రూ.10,62,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు.పేదల సమస్యలే నా సమస్యలు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తాను అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రవాణా సౌకర్యం అందింది. పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందింది. అనారోగ్య సాయం లభించింది. మా సమస్యలను తమ సమస్యలుగా తీసుకొని పరిష్కరించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అని గ్రామల ప్రజలు తెలిపారు. మొత్తంగా, పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. బస్సు సర్వీస్ ప్రారంభం, చెక్కుల పంపిణీ, మహిళా సాధికారత కార్యక్రమాలతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.
Also Read: Ram chander Naik: సత్యవతి రాథోడ్ ఇది మీకు తగునా?.. ఘాటుగా స్పందించిన డిప్యూటీ స్పీకర్