Ram chander Naik (IMAGE credit; swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ram chander Naik: సత్యవతి రాథోడ్ ఇది మీకు తగునా?.. ఘాటుగా స్పందించిన డిప్యూటీ స్పీకర్

Ram chander Naik:  మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఇది మీకు తగునా..? అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రనాయక్ (Ram chander Naik) ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో మంత్రిగా వెలగబెట్టిన సత్యవతి రాథోడ్ మీకు యూరియా పై ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులను రిక్వెస్ట్ చేస్తే పది బస్తాలు ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ ఒక బస్తా యూరియా మాత్రమే ఇచ్చారని నమ్మబలకడం ఏంటని.. నిలదీశారు. అసలు గుండ్రాతి మడుగు సహకార బ్యాంకు పరిధిలో మీకు వ్యవసాయం ఉందా..? ఉంటే ఎన్ని ఎకరాలు ఉందో చెప్పాలన్నారు. అగ్రికల్చర్ అధికారులను రిక్వెస్ట్ చేసి యూరియా బస్తాలను ఇంట్లో వేసుకుని మళ్లీ ప్రభుత్వాన్ని బధనం చేయడం ఏంటని నిలదీశారు.

 Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ రహస్య నివేదికను సీఎంకు అందించిన మహేష్ కుమార్ గౌడ్

ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి 

యూరియా కొరత దేనివల్ల ఏర్పడిందో కూడా.. తెలియకుండా ప్రవర్తిస్తే మంచిది కాదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. అక్కడేమో షాపుల దగ్గర మోడీ ఫోటో పెట్టుకుంటారు. మీరేమో ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని నిందించడం ఇంతవరకు కరెక్టో తెలుసుకోవాలన్నారు. ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని, మీరు చేసే మరి డ్రామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా డోర్నకల్ ప్రజలు దీన్ని హర్షించరని గుర్తు చేశారు. మీరు 10 బస్తాలు యూరియా తీసుకొని, రెండు గంటలు నిలబడితే ఒకటే యూరియా వస్తారని మహానటి సావిత్రి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాయి తగ్గే విధంగా భవిష్యత్తులో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు.

పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరూ సమిష్టిగా రైతులకు యూరియా అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అందరి సమన్వయంతోటే రెండు గంటల్లోనే 8 నుండి 11 లోపే యూరియా బస్తాలను ఇచ్చేందుకు ముందు రోజే లిస్ట్ తయారుచేసి యూరియా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఎవరికైతే ఇంతవరకు రాలేదో వారందరికీ తప్పకుండా యూరియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. కొంతమంది మళ్ళీ మళ్ళీ తీసుకొని, లైన్లో నిలబడి తీసుకొని దాన్ని బ్లాక్ చేయకండనీ అదేవిధంగా సహకరించండి… అదేవిధంగా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లైన్లో నిలబడి కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఇలాంటి సమస్యలను సృష్టించకండనీ దానివల్ల ప్రజలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనీ, తప్పకుండా మీ పార్టీ చేసే, మీ నాయకులు చేసే గ్రామాలు ప్రజలు తెలుసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.

 Also  Read: Viral Video: టూరిస్ట్‌గా వచ్చి.. లోకల్ బాలికలతో పిచ్చివేషాలు.. చితక్కొట్టిన స్థానికులు

సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ వార్షికోత్సవాలను.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ వార్షికోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, మానుకోట జిల్లా కేంద్రంలో మూడు కొట్ల సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం దగ్గర అధికారికంగా ఘనంగా నిర్వహించాలని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి వర్గ సమావేశం స్థానిక వీరభవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలి

ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చారన్నారు బిజెపి పార్టీకి సంబంధంలేని సాయుధ పోరాటాన్ని బిజెపి వాడుకుంటుంది అన్నారు అసలు బిజెపి సాయుధ పోరాటంలో పాల్గొనలేదని అన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం దగ్గర అధికారిక లాంచనాలతో జిల్లా యంత్రాంగం నిర్వహించాలని అన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 సాయుధ పోరాట వార్షికోత్సవాలను ముగింపు సందర్భంగా మూడు కోట్ల జంక్షన్ లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం దగ్గర ఘనంగా నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ సహాయ కార్యదర్శి దేశపల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు వెలుగు శ్రావణ్ పాల్గొన్నారు.

 Also Read: Mahesh Kumar Goud: క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్.. రూ.200 కోట్లు విడుదల

Just In

01

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

KCR: జూబ్లీహిల్స్‌లో కేసీఆర్ ప్రచారం పై వీడని సస్పెన్స్.. ఉత్కంఠ రేపుతున్న సారు తీరు

WPL 2026: డబ్ల్యూ పిఎల్ 2026 రిటెన్షన్స్.. MI, DC, RCB, UPW, GG టీమ్స్ ఎవరెవర్ని దక్కించుకున్నాయంటే?

Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..

Mexican President: మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా పై లైంగిక వేధింపులు