Mahesh Kumar Goud (imagecredit:swetcha)
Politics

Mahesh Kumar Goud: క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్.. రూ.200 కోట్లు విడుదల

Mahesh Kumar Goud: క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ పై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో క్రీడారంగం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేదన్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికితీస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కరాటే మాస్ క్రీడగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.అందుకే జాతీయ కరాటే పోటీలను విజయవంతంగా నిర్వహించామని.. వచ్చే ఏషియన్ కరాటే ఛాంపియన్‌షిప్(Asian Karate Championship) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దడం మాస్టర్స్ బాధ్యత అని గుర్తు చేశారు. కరాటేను అధికారిక క్రీడగా పరిగణించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Also Read: Modern Kitchens: షేక్ పేట ధర్మపురిలో మోడ్రన్ కిచెన్ షెడ్లు నిర్మాణం: మంత్రి లక్ష్మణ్

హిందీ జర్నలిస్టు అసోసియేషన్

ఇక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన హిందీ దివాస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ..1949లో భారత రాజ్యాంగ సభ హిందీని దేశ అధికార భాషగా ప్రకటించిందని గుర్తుచేశారు. హిందీ భాష దేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందని తెలిపారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు కోట్లాది భారతీయులను కలిపే వంతెనగా హిందీ భాష నిలిచిందన్నారు.భారత దేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన విశాల గంగోత్రి అని పేర్కొన్నారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో ఇంగ్లీష్ ప్రాధాన్యం పెరిగినా, హిందీ తన స్థానాన్ని కోల్పోలేదన్నారు. తెలుగు తో పాటు హిందీ నేర్చుకోవడం, మాట్లాడడం, దాని వాడకాన్ని పెంపొందించడం ద్వారా జాతీయ ఐక్యతకు తోడ్పడాలన్నారు.

Also Read: Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?