Gurramgadda Village: రాష్ట్రంలోనే దీవి గ్రామమైన గుర్రంగడ్డ(Gurramgadda Village)లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న తమకు విద్యా బోధన చేసేందుకు తమకు ఉపాధ్యాయుని నియమించాలని ఆ గ్రామంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. కృష్ణానది మధ్యలో దీవి గ్రామముగా గుర్రం గడ్డ ఏర్పడ్డది. ఈ గ్రామానికి రాకపోకలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తునన్ని రోజులు పవర్ బోట్ ప్రయాణమే దిక్కయింది. వ్యవసాయ సామాగ్రిని వేసవిలోని తరలించి ఇళ్ల దగ్గర డంపు చేసుకోగా.. వేసిన పంటల ఉత్పత్తులను నదీ ప్రవాహం తగ్గేదాకా ఇళ్లలోనే నిల్వ చేసుకుంటారు.
Also Read: Jangaon Politics: జనగామ రాజకీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!
ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో
ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గుర్రంగడ్డ గ్రామం నుంచి మల్దకల్ మండల కేంద్రానికి గత నెల 26న బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో నేటి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 30 మంది చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేపథ్యంలో నేడు 20 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. గ్రామానికి రెండు రోజులలో ఉపాధ్యాయుని నియమిస్తానని ఈ మేరకు హామీనిచ్చారని విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కురుమన్న తెలిపారు.
అంగన్వాడి కేంద్రం సైతం..
గ్రామంలో 20 మంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వస్తుండగా అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. గతంలో కలెక్టర్ గ్రామానికి వచ్చినప్పుడు తమ సమస్యలను విన్నవించినా నేటికీ అవి కార్యరూపం దాల్చలేదన్నారు. రెండు మూడు నెలలకు ఒకసారి సమీపంలోని బీరెల్లి నుంచి అంగన్వాడి టీచర్ వచ్చి తమ గ్రామంలో బాలామృతం లాంటి వస్తువులను ఇచ్చి వెళ్ళుతున్నారే తప్ప చిన్నారులకు బేసిక్స్ నేర్పే టీచర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Bhadrakaali: దసరా నవరాత్రుల సమయంలో ‘భద్రకాళి’.. సక్సెస్ పక్కా అంటోన్న నిర్మాత!