RRB: సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా రైల్వే జోన్‌లలో ఖాళీగా ఉన్న 434 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అర్హులైన అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కాబట్టి, ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకోకకండి.
పోస్టుల వివరాలు
సూపరింటెండెంట్: 272 పోస్టులు
డయాలిసిస్ టెక్నీషియన్: 4 పోస్టులు
హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2: 33 పోస్టులు
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 105 పోస్టులు
రేడియోగ్రాఫర్/ఎక్స్-రే టెక్నీషియన్: 4 పోస్టులు
ఈసీజీ టెక్నీషియన్: 4 పోస్టులు
లాబోరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-2: 12 పోస్టులు
అర్హతలు
అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఈ క్రింది విద్యార్హతలను కలిగి ఉండాలి:B.Sc. నర్సింగ్, B.Sc., డిప్లొమా (సంబంధిత విభాగంలో)
10+2 (సైన్స్ స్ట్రీమ్‌తో)
ఫార్మసీ, రేడియోగ్రఫీ, DMLTలో డిప్లొమా లేదా డిగ్రీ
వివరణాత్మక అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తప్పక చదవండి.
వయోపరిమితి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు ఉండాలి.
సడలింపు: OBC, SC, ST, ఇతర రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, OBC, EWS అభ్యర్థులు: రూ. 500 ను చెల్లించాలి.
SC, ST, మైనారిటీ, EBC, PwBD, ESM, మహిళలు, ట్రాన్స్‌జెండర్: రూ. 250 ను చెల్లించాలి.
రుసుము చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.
వేతనం
నర్సింగ్ సూపరింటెండెంట్: రూ. 44,900 ను జీతాన్ని చెల్లిస్తారు.
డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్: రూ. 35,400 జీతాన్ని చెల్లిస్తారు.
ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్/ఎక్స్-రే టెక్నీషియన్: రూ. 29,200 జీతాన్ని చెల్లిస్తారు.
ఈసీజీ టెక్నీషియన్: రూ. 25,500 జీతాన్ని చెల్లిస్తారు.
లాబోరేటరీ అసిస్టెంట్: రూ. 21,700 జీతాన్ని చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ
సెప్టెంబర్ 18, 2025 లోపు దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు విధానం
1. అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ (www.rrbsecunderabad.gov.in) (www.rrbsecunderabad.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
2. దరఖాస్తు సమర్పించే ముందు నోటిఫికేషన్‌లోని అర్హతలు, సూచనలను జాగ్రత్తగా చదవండి.
3. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
