The Great Pre-Wedding Show (image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Thiruveer: వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show). బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ (Rahul Srinivas) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర టైటిల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి (The Great Pre Wedding Show Trailer Launch Event) దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Aaryan Movie: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ విడుదల వాయిదా.. కారణం రవితేజ, ప్రభాసే!

ఆ కష్టాలేంటో నాకు తెలుసు

ఈ కార్యక్రమంలో దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) మాట్లాడుతూ.. తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. అప్పుడే అనుకున్నా.. నేను మూవీ కనుక తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని గట్టిగా అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతగానో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు ఎలా ఉంటాయో మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ మధ్యకాలంలో రూటెడ్ కథల్నే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ‘అనగనగా’ దర్శకుడు సన్నీ, ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు, దర్శకుడు ఆదిత్య హాసన్, దర్శకుడు యదు వంశీ, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ దర్శకుడు దుశ్యంత్, దర్శకుడు ఉదయ్ గుర్రాల వంటి వారంతా మాట్లాడుతూ.. తిరువీర్‌కు, టీమ్‌కు ఈ మూవీతో మంచి సక్సెస్ రావాలని కోరారు.

Also Read- Dacoit: అడవి శేష్ ‘డకాయిట్’ రిలీజ్ డేట్ మారింది.. ఇక వచ్చే సంవత్సరమే!

ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్లుగా.. 

చిత్ర హీరో తిరువీర్ మాట్లాడుతూ.. మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈవెంట్ కోసం ఇంత మంది దర్శకులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. సినిమా చూసే వాళ్లకి కూడా ఈ సినిమా అలాగే అనిపిస్తుంది. మంచి కంటెంట్‌తో నవంబర్ 7న రాబోతున్న మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్ అని అన్నారు. ఇంకా చిత్ర దర్శకుడు, నిర్మాతలు, చిత్ర టీమ్ ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?