Suriya: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) హీరోహీరోయిన్లుగా నటించిన ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా కోసం తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. నవీన్ చంద్ర విలన్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మాస్ జాతర’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Mass Jathara Pre Release Event)ను మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగిన ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read- Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?
రవితేజ నటనకు నేను ఫ్యాన్
ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘రవితేజ అభిమానులను, నా అభిమానులను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. అభిమానుల మధ్యలో జరిగే ఇలాంటి వేడుకలకు రావడమంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఆహ్వానించిన నిర్మాత నాగవంశీకి థ్యాంక్స్. రవితేజతో నాది 20 ఏళ్ళ అనుబంధం. ఈ రోజు ఒక ఫ్యాన్ బాయ్‌లా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ అని నేను చెబుతాను. చాలా ఏళ్లుగా రవితేజపై అభిమానులు ఎంతో ప్రేమని కురిపిస్తున్నారు. తెరపై ఒక కామన్ మ్యాన్‌ని కింగ్ సైజ్‌లో సహజంగా చూపించాలంటే అది రవితేజ తర్వాతే. అది కేవలం రవితేజకే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను ఫ్యాన్. నవ్వించడం అనేది చాలా చాలా కష్టం. కానీ, రవితేజ మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా అందరికీ వినోదాన్ని పంచుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఆయన చేస్తారు.
Also Read- Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?
రజినీ, అమితాబ్‌లానే రవితేజ
‘ఇడియట్, కిక్’ సహా రవితేజ నటించిన చాలా సినిమాలు తమిళ్‌లోనూ మంచి ఆదరణ పొందాయి. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’ రీమేక్.. నా సోదరుడు కార్తీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు, ఎప్పుడూ అంత ఎనర్జీగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. రవితేజ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. ఆయనపై దర్శకుడు భానుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్‌గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ ఎందరికో స్ఫూర్తి. నాగవంశీ వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్‌లో నేను కూడా ఒక సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాము. అక్టోబర్ 31న విడుదలవుతున్న ‘మాస్ జాతర’ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
