Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి
కమ్మ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కమ్మ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కమ్మ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అమీర్‌పేట్ మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు కమ్మ సంఘాలు ప్రకటించాయి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కమ్మ సామాజిక వర్గంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు.
Read Also- Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?
తప్పకుండా ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తామన్నారు. మైత్రీ వనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతోపాటు కమ్మ సంఘాల నాయకుల విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేశ్, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Also- Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి కీలక ఆదేశాలు
నవంబర్‌లో మహారాష్ట్రకు ఉత్తమ్
152 మీటర్ల తుమ్మడిహెట్టికి అనుమతికోసం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆదిలాబాద్ లో ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు అనుమతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నవంబర్ లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. తొలుత ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తు లో ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంలో చర్చించనున్నారు. తుమ్మిడి హట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీలు నీటిని తరలించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
