Dr. B. Veeranna: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం.. భావి వైద్యుల పరీక్షల కోసం పార్థివ దేహాలను మెడికల్ కళాశాల(Medical College)కు అందజేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉండాలని మహబూబాబాద్(Mahabubabad) లయన్స్ క్లబ్(Lions Club) అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న పిలుపునిచ్చారు. రక్తదాన పక్షోత్సవాలలో భాగంగా రక్త, నేత్ర, అవయవ, పార్థివ దేహాల దానంపై మానుకోటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వీరన్న అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విపత్కర పరిస్థితుల్లో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. చెత్తగాళ్లంటూ ఫైర్!
పునర్జన్మ లభిస్తుంది
డయాబెటిస్ బారిన పడి డయాలసిస్ చేయించుకుంటున్న వారితోపాటు ప్రమాదానికి గురైన వారికి రక్తం ఎంతగానో అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వారు మూడు నెలలకోసారి రక్త దానం చేయవచ్చని చెప్పారు. అలాగే కంటి చూపు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే వారికి మరణానంతరం నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ కంటి చూపు వస్తుందని తెలిపారు. వివిధ రకాల జబ్బులతో అవయవాలు సక్రమంగా పని చేయని వారికి అవయవాలు దానం చేయడం ద్వారా వారికి పునర్జన్మ లభిస్తుందన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఫార్థివదేహం మెడికల్ కళాశాలకు అందించడం వల్ల బావి వైద్యులైన మెడికల్ విద్యార్థులకు శవంద్వారా వైద్య విద్య బోధన జరుగుతుంది వెల్లడించారు.
సమాజానికి సేవ చేసే అవకాశం
మరణించిన తర్వాత కూడా సమాజానికి వారి మృతదేహాలు ద్వారా సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఎడ్ల వెంకట సాయి వరుణ్ పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీనివాస్ యాదవ్ తన మరణానంతరం తన పార్థివదేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి అందించడానికి ముందుకు రాగా ఆయన సతీమణి శ్రీలత అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దంపతుల నుంచి ఆయా దానాల అంగీకార పత్రాలను స్వీకరించారు. ఇంకా కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు, క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, ఎడ్ల వేణుమాధవ్, చిట్యాల జనార్దన్, కాలనీ వాసులు గార్లపాటి మహిపాల్ రెడ్డి, మొగిలి వీరారెడ్డి, వీరన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: KTR: బీఆర్ఎస్ పూర్తి పగ్గాలు ఆయనకే.. గులాబీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!