Viral video: స్త్రీల జీవితంలో అతి క్లిష్టమైన సమయంగా ప్రసవాన్ని చెబుతుంటారు. ఆ సమయంలో భరించలేని నొప్పులతో వారు బాధపడుతుంటారు. పురిటి నొప్పులను తాళలేక విల విల లాడిపోతుంటారు. ఆ సమయంలో భర్త తన పక్కనే ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని స్త్రీలు భావిస్తారు. అయితే ఓ భర్త.. ఈ సమయంలో భార్య పక్కనే ఉండటం కాకుండా ఆమెను క్యూట్ గా నవ్వించే ప్రయత్నం చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను రాజేష్ రాజన్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. వీడియోలో భర్త తన భార్య బాధను మరిపించేందుకు పక్కనే సరదాగా డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ఆమెను ముద్దుపెట్టుకొని ఏం కాదని భరోసా కల్పించాడు. అప్పటివరకూ ప్రసవ భయంతో ఉన్న ఆమె.. భర్త చేష్టలకు ఒక్కసారిగా నవ్వడం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో నెట్టింట శరవేగంగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read: Youtuber Arrested: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి ఏమో.. అడ్డంగా బుక్కైన యూట్యూబర్
నెటిజన్ల రియాక్షన్..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటను చూస్తుంటే చూడముచ్చగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా దిష్టి తీయాలని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఓ మహిళా నెటిజన్ ఏకంగా.. ‘నాకు ఇలాంటి భర్త కావాలి.. అతడు చాలా మంచివాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఇతనే అసలైన మగాడు’ అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
Also Read: Damodar Rajanarasimha: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పై మంత్రి ఫైర్.. ఎమన్నారంటే..?
ప్రేరణ పొందాల్సిందే
భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్న వేళ.. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను లేవనెత్తింది. భార్య, భర్తలు తమ దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉంటే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదని అంటున్నారు. భార్యకు కష్టం వచ్చినప్పుడు అతడు ఏ విధంగా అండగా నిలిచాడో ప్రతీ ఒక్కరు ప్రేరణగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే భార్యలు సైతం తమ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిస్తే అతడు ఎప్పటికీ పరాయి స్త్రీ వైపునకు ఆకర్షితుడు కాడని అంటున్నారు.