Youtuber Arrested: అతిగా నీతులు చెప్పేవారు రియాలిటీలో దానిని పాటించరని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే దానిని ఓ వ్యక్తి నిజం చేస్తూ కటకటాల్లోకి వెళ్లాడు. ఒడిశాకు చెందిన ఒక యూట్యూబ్ మోటివేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ దూరంగా ఉండమని చెప్పే అతనే.. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఆగస్టు 14న ఓ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి యూట్యూబ్ లో మోటివేషనల్ లెక్చర్లు ఇచ్చే వ్యక్తిని భువనేశ్వర్ పోలీసుల అరెస్ట్ చేశారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను భువనేశ్వర్ – కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ (Suresh Dev Dutta Singh) వెల్లడించారు. కటక్‌కు చెందిన మనోజ్ సింగ్‌ను భువనేశ్వర్‌లోని ఒక ఇంటిలో దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. అతను దాదాపు 200 గ్రాముల బంగారం, రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు, ఒక మోటార్ బైక్ దొంగిలించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!
పగలు నీతులు.. రాత్రి ఐతే
పోలీసుల ప్రకారం.. మనోజ్ సింగ్‌కు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆయన నిజాయితీగా జీవించడం గురించి మోటివేషనల్ ప్రసంగాలు చేసేవారు. ‘ఒకరు ఎలా నేరస్తుడిగా మారతారు’ అనే థీమ్ తో సురేష్ ఓ వీడియో సైతం చేశాడు. అందులో నేరాలను ఎలా నియంత్రించాలో కూడా చెప్పారు. అలా యూట్యూబ్ లో నీతులు చెప్పే మనోజ్ సింగ్ రియాలిటీలో దొంగతనం చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు కారణమైంది. అతడు పగలు మోటివేషన్ స్పీకర్ కట్టింగ్ ఇచ్చి.. రాత్రివేళల్లో దొంగతనాలు చేసేవాడని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాదు భువనేశ్వర్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో 10 పైగా క్రిమినల్ కేసులు అతడిపై ఉన్నట్లు వివరించారు.
Living a double life !!!
A habitual burglar, who was delivering motivational talks on crime-free society on social media, arrested for stealing gold, cash from a house in #Bhubaneswar pic.twitter.com/dy2x1mxv6V
— Debabrata Mohapatra (@DebabrataTOI) August 29, 2025