BRS Harish Rao Protest: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మెుదలైన తొలి రోజే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రాష్ట్రంలోని యూరియా కొరతను నిరసిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో సచివాలయాన్ని ముట్టడించారు. హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ రోడ్లపై పరిగెత్తుకుంటూ సచివాలయం వద్దకు వెళ్లడం ఆసక్తిరేపుతోంది.
అరెస్ట్ చేసిన పోలీసులు
అంతకుముందు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. అక్కడ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు.
రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..
యూరియా రైతుల హక్కు…
అది అందకుండా చేయడం
కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఆ తర్వాత హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు.. రోడ్డుపై పరిగెత్తుకుంటూ రాష్ట్ర సచివాలయం వరకూ వెళ్లారు. యూరియా కొరత కారణంగా రాష్ట్రంలో ఏ రైతు సంతోషంగా లేడని.. పండగ పూట కూడా రైతులను ప్రభుత్వం రోడ్లపై నిలబెట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘గణపతి బప్పా మోరియా.. కావలయ్యా యూరియా’ అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. రోడ్డుపై పెరిగెత్తుకుంటూ సచివాలయం వద్దకు వెళ్లిన దృశ్యాలను హరీశ్ రావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం.
Also Read: Viral Video: మీ ఫ్రెండ్ షిప్ తగలెయ్య.. సెలైన్‌తో ఉన్న స్నేహితుడితో.. బైక్ రైడ్ ఏంట్రా!
మంత్రి తుమ్మల సూటి ప్రశ్నలు
మరోవైపు బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కపట నాటకమని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. .రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా? నిలదీశారు. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు ఎందుకు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా? అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
Also Read: Indore Woman: ప్రియుడితో లేచిపోయి.. మరొకరిని పెళ్లాడి.. ఫైనల్‌గా ఇంటికొచ్చేసిన యువతి
అసెంబ్లీలో సంతాప తీర్మానం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంపై సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయన రాజకీయ నేపథ్యంతో పాటు.. ప్రజాసేవలో అతడు సాధించిన ఘనతలను సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించాడు. రాజకీయాల్లో మార్పు వచ్చినా, మిత్రుడిగా తమ మధ్య ఎలాంటి మార్పు రాలేదని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.